శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ సన్నాహక సమావేశం

జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకూ తెలంగాణా రాష్ట్రంలో జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో పూజ్య స్వామిజీలు గ్రామగ్రామానికి పర్యటించడానికి కార్యచరణ రూపొందించారు. తమ తమ పీఠాలు , మఠాల నుండి కూడా రామ మందిర నిర్మాణానికి నిధిని ప్రకటించారు.

హైదరాబాద్లోని శ్రీ శ్యాంబాబా మందిర్, కాచిగూడ లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో పూజ్య శ్రీ శ్రీనివాస వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారు , కేంద్ర మార్గదర్శక మండలి సభ్యులు పూజ్య శ్రీ సంగ్రామ్ మహరాజ్ స్వామిజీ, స్వామి శ్రీరామానంద ప్రభుజీ , శ్రీ సిద్దేశ్వరానందగిరి స్వామి, శ్రీ ఆత్మానంద భారతి స్వామి , . శ్రీ రత్నానంద స్వామి, శ్రీ గణేష్ మహరాజ్ స్వామి , . శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి జీ, శ్రీ సత్యానందపురి అప్ప స్వామి , శ్రీ పూజ్యపాద రాజయోగి స్వామిజీ , గురుమాతశ్రీ శ్రీమతి దివ్య శ్రీరమణ చక్రవర్తుల మాతాజీ , శ్రీ శంకర్ గిరి స్వామిజీ , శ్రీ చైతన్య స్వామిజీ లు పాల్గొని మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో VHP జాతీయ సహా కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు M. రామరాజు, నిధి సమర్పణ అభియాన్ తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ బండారి రమేష్ , నిధి సమర్పణ అభియాన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీసం శెట్టి విద్యాసాగర్ పాల్గొని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న కార్యచరణ విధి విధానాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *