BIG BREAKING : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దిమ్మదిరిగే అంశాలు – 8 చార్జిషీట్‌లలో 72 మంది పేర్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దిమ్మదిరిగే అంశాలు బయటకు వచ్చాయి. చార్జిషీట్‌లో మొత్తం 72 మంది పేర్లను చేర్చారు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 12 మంది ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు ప్రశ్నించారు. ఆ సమయంలో ఈ కేసు సంచలనం సృష్టించింది. రోజుల తరబడి టాలీవుడ్‌ ప్రముఖుల విచారణ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

ఇన్నాళ్లు ఈ కేసులో ఏం జరిగిందన్న విషయాలు బయటకు రాలేదు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ చార్జిషీట్లలో ఏముందంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగింది. దీనికి ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఉన్న వివరాలన్నీ పేర్కొన్నారు.

 

గత రెండేళ్లలో మొత్తం 12 డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయని ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. అయితే.. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌లు దాఖలు చేశామని తెలిపింది. అయితే.. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై మాత్రం సమాచారం ఇవ్వలేదు.

 

ఎక్సైజ్‌ శాఖ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చన సమాచారంతో హైదరాబాద్‌తో సంబంధం ఉన్న డ్రగ్స్‌ కేసుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌ డ్రగ్స్‌ దందా దేశ విదేశాలతో సంబంధం ఉందని తేలింది. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ హైదరాబాద్‌కు చేరాయని గుర్తించారు. విదేశాల నుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ పార్శిళ్ల రూపంలో వచ్చినట్లు దర్యాప్తులో తేల్చారు. www.ipsld.lo అనే వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు డ్రగ్స్‌ బుకింగ్‌ చేసుకునేవారని, వాళ్ల ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పెడలర్స్‌ అవసరమైన వాళ్లకు చేరవేసేవారని గుర్తించారు. అంతేకాదు.. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ సమీపంలో ఉన్న ఓ మెడికల్‌ షాపులో సైతం డ్రగ్స్‌ అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా 8 చార్జిషీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో 72 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో విచారణకు హాజరైన 12 మంది టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు మరో 60మంది పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

8 Comments on “BIG BREAKING : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దిమ్మదిరిగే అంశాలు – 8 చార్జిషీట్‌లలో 72 మంది పేర్లు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *