NEWJERSY BJP : రఘునందన్ రావు విజయోత్సవ సభ –  GHMC విజయానికి దుబ్బాక నాంది అన్న వక్తలు

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై విజయ దుందుభి మోగించిన మాధవనేని రఘునందన్ రావు సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎన్ఆర్ఐలు  న్యూ జెర్సీ రాష్ట్రంలో హౌస్ అఫ్ కెబాబ్స్ & బిర్యాని రెస్టారంట్లో సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయాని కష్టపడి పనిచేసిన పరివార క్షేత్ర కార్యకర్తలకు నాయకులకు వారికి అద్భుత ప్రొత్సాహాన్ని అందించిన రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇదే ఉత్సాహంతో వచ్చే  జీఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసి మేయర్ స్థానాన్ని సాధించాలని అభిలషించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుకల్ని జరుపుకున్నారు.

ఈ సంబరాల్లో ముఖ్య అతిధిగా కృష్ణ రెడ్డి ఏనుగులతో పాటు సంతోష్ , విలాస్ జంబుల , ప్రకాష్ , వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *