Corruption : నడిరోడ్డుపై కెమెరాకు చిక్కిన మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ – లైవ్‌ వీడియో వైరల్‌

నడిరోడ్డుపై మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ కెమెరాకు చిక్కాడు. ఆ లైవ్‌ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. కారులో కూర్చున్న ఓ వ్యక్తి నుదుటిపై బొట్లు పెట్టుకున్నాడు. చూస్తే మంచి భక్తుడిలా కనిపిస్తున్నాడు. అతను కారులో కూర్చొనే కొందరు బయటినుంచి ఇచ్చిన డబ్బులు లెక్కిస్తున్నాడు. అవి సరిపోవని వాదిస్తూనే వాళ్లకు ఏవో పత్రాలు తిరిగి ఇస్తున్నాడు. మనిషి ముఖం చూస్తే భక్తిభావం పొంగిపోతుంది. కానీ, అతని గుణం చూస్తే మాత్రం ముఖం మీదే ఛీత్కరించాలనిపిస్తుంది. ఎందుకంటే అతనో లంచావతారం. నడిరోడ్డుమీదే దుకాణం తెరిచాడు. యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిజిల్లాలో ఓ మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ నడిరోడ్డుపైనే వసూళ్లకు పాల్పడ్డాడు. అధికారిక యూనిఫామ్‌ లేకుండా కారులో వచ్చి వాహనాల డ్రైవర్ల వద్ద ఉన్నకాడికి దండుకున్నాడు. ప్రశ్నించిన వాళ్లను బెదిరించాడు. వదిలేయాలని వేడుకున్న వాళ్లను ఛీత్కరించాడు. చివరకు క్యూలు కట్టించి మరీ పలువురి దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ల వాహనాలకు సంబంధించిన పత్రాలు తిరిగి ఇచ్చాడు.

ఈ దుర్మార్గాన్ని తట్టుకోలేని కొందరు అక్కడ వీడియో రికార్డ్‌ చేశారు. మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ మృత్యుంజయరాజు బేరాలు ఆడి మరీ డబ్బులు వసూళ్లు చేసి వాహనాల పత్రాలు తిరిగి ఇచ్చే దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. తాడేపల్లిగూడెం బైపాస్‌ రహదారిపై ఈ సంఘటన జరిగింది.

ఈ వీడియో సెల్‌ఫోన్ల ద్వారా సోషల్‌ మీడియాలోకి చేరింది. వాట్సప్‌లో విపరీతంగా తిరిగింది. వీడియో వైరల్‌ కావడంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్‌ చేశారు. ఈమేరకు రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు వెలువరించారు.

ఈ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.
https://youtu.be/0HsMDHfvii8

 

One Comment on “Corruption : నడిరోడ్డుపై కెమెరాకు చిక్కిన మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ – లైవ్‌ వీడియో వైరల్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *