ఆన్‌లైన్‌ క్లాసులకోసం స్మార్ట్‌ఫోన్‌ ఇస్తే ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా?

దేశమంతా స్కూల్స్‌ తెరవకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసుల యుగం నడుస్తోంది. ఏ ఇంట్లో చూసినా ఆన్‌లైన్‌ క్లాసుల సందడి కనిపిస్తోంది. కొందరేమో పిల్లలకోసం కొత్తఫోన్లు కొనుగోలు చేయగా.. మరికొందరు తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్లనే ఆన్‌లైన్‌ క్లాసులకోసం పిల్లలకు ఇస్తున్నారు. అయితే.. ఇదే క్రమంలో ఆన్‌లైన్‌ క్లాసులకోసం ఓ తండ్రి స్మార్ట్‌ఫోన్‌ ఇస్తే.. ఆపిల్లాడు ఏం చేశాడో తెలిసేందుకు ఆరునెలలు పట్టింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుందీ సంఘటన. ఆగ్రాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి తన కుమారుడికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చాడు. క్లాస్‌ జరుగుతున్న సమయంలో ఆ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించిన అబ్బాయి.. క్లాస్‌ పూర్తయ్యాక ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడ్డాడు.

అలా అన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ రెండున్నర లక్షలరూపాయలు హాంఫట్‌ చేసేశాడు ఆ బాలుడి తండ్రి బ్యాకు అకౌంట్‌ చెక్‌ చేసుకుంటే గానీ ఈవిషయం తెలియలేదు. అయితే.. మొదటగా భయపడ్డ తండ్రి.. ఎవరో సైబర్‌ నేరగాళ్ల పని అయి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం కనిపెట్టారు.

పేటిఎం ద్వారా రెండున్నర లక్షలరూపాయలు ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని తేల్చారు. కుమారుడికి ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే ఈ లావాదేవీలు జరిగనట్లు గుర్తించారు. అయితే, ఆ బాలుడు కూడా తెలిసీ తెలియక, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ.. రివార్డ్‌ పాయింట్స్‌, గేమ్‌ అప్‌డేట్స్‌ వంటి ఆప్షన్స్‌ క్లిక్‌ చేయడంతో ఆ డబ్బులన్నీ ఖాతానుంచి మాయమయ్యాయని తెలుసుకున్నారు.

4 Comments on “ఆన్‌లైన్‌ క్లాసులకోసం స్మార్ట్‌ఫోన్‌ ఇస్తే ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *