fact check – ఏదినిజం? : బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా?

బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా? సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది.

వాస్తవానికి రాజాసింగ్‌ హార్డ్‌కోర్‌ హిందూ నాయకుడు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీలో ఉద్ధండులమని చెప్పుకునే నేతలకన్నా రాజాసింగ్‌ ఒక అడుగు ముందే ఉంటారు.

ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది తలెత్తినా, హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తారు. బాధ్యులపై ఆరోపణలు చేస్తారు. పోలీసులను విమర్శిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు.

బీజేపీ నేతలు సర్దుకునేలోపే తన రియాక్షన్‌ మీడియాకు పంపిస్తారు. ఇంతటి యాక్టివ్‌ నాయకుడైన రాజాసింగ్‌ ఒక్కరే బీజేపీ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటిదాకా ఉన్న సిట్టింగ్‌ల సీట్లు కూడా గల్లంతైనా… రాజాసింగ్‌ తన సొంత ఇమేజ్‌తో గెలిచారు. బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించారు.

ఇప్పుడు, ఓ వైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల హీట్‌ నడుస్తోంది. జనమంతా అటువైపే దృష్టి సారించారు. నామినేషన్లకు చివరితేదీ కావడంతో అందరి దృష్టీ టికెట్ల కేటాయింపులు, నామినేషన్లపైనే ఉంది. పైగా ఎన్నికలకు అతితక్కువ సమయం ఉండటంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మినహా.. వేరే అంశంపై దృష్టిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది.

ఇదే సమయంలో ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీకి రాజీనామా చేశారన్నది దీని సారాంశం. దీంతో.. ఒక్కసారిగా ఉలికిపాటు చోటు చేసుకుంది. మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్‌రావు గెలుపు మినహా అసెంబ్లీలో గళం వినిపిస్తున్న ఏకైక నాయకుడు రాజాసింగ్‌. పైగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఆయన నియోజకవర్గం గోషామహల్‌ ఉంది.

ఈ కారణంగా రాజాసింగ్‌ రాజీనామా అనే వైరల్‌ ప్రచారం కలకలం సృష్టించింది.

ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం.

అయితే.. మధ్యాహ్నానికే రాజాసింగ్‌ క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

ప్రచారం : ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీకి రాజీనామా చేశారు.

వాస్తవం : తాను రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రాజాసింగ్‌ ఖండించారు.

కంక్లూజన్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టినీ మళ్లించేందుకు, ఓటర్లను గందరగోళంలో పడేసేందుకే ఈ ప్రచారం చేసినట్లు అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *