FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం…

సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది.

అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమితిలో పనిచేసేందుకు కేంద్రం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని వివరించారు.

దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ వెబ్‌సైట్‌ లింకును కూడా వైరల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరి, కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఈ ఉద్యోగ ప్రకటన ఇచ్చిందా? నిరుద్యోగులు ఆశపడినట్లు త్వరలోనే వాళ్లకు ఉద్యోగాలు వస్తాయా? అనే విషయంపై ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది.

వైరల్‌ పోస్ట్‌లో kvms.org.in/organisation.php అనే వెబ్‌సైట్‌ అడ్రస్‌ను ఇచ్చారు.

ప్రాథమిక పరిశీలనలోనే ఈ వాదన నిజం కాదనేందుకు క్లూ దొరికింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ వెబ్‌సైట్‌ అడ్రస్‌ అయినా gov.in పేరుతో ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో gov అనే పదం లేదు. అంటే ఇది ప్రైవేటు సంస్థది అయినా అయి ఉండాలి, లేదంటే ఎవరైనా మోసపూరితంగా ఈ వెబ్‌సైట్‌ రూపొందించి ఉండాలి.

మరోవైపు.. ఈ క్లెయిమ్‌ తప్పు అని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్‌ కూడా నిర్ధారించింది. ఈ ప్రచారం తప్పు అని, ఇలాంటి వెబ్‌సైట్‌ వ్యవసాయ, రైతు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించలేదని స్పష్టత ఇచ్చింది.

ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం :

 

ప్రచారం : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోంది
వాస్తవం : ఇది తప్పుడు వెబ్‌సైట్‌. దీనిని ఎవరూ నమ్మవద్దు.
కంక్లూజన్ : కేంద్ర ప్రభుత్వం అసలు కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి అనే విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. అంతేకాదు.. వైరల్‌ పోస్ట్‌లో తిరుగుతున్న వెబ్‌సైట్‌ అ్రడస్‌ నకిలీది.

One Comment on “FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *