IAS Goal : అత్యున్నత సర్వీసును యువత అందిపుచ్చుకోవాలి – మహబూబాబాద్ కలెక్టర్‌ గౌతమ్‌

IAS Goal : అత్యున్నత సర్వీసును యువత అందిపుచ్చుకోవాలి – మహబూబాబాద్ కలెక్టర్‌ గౌతమ్‌

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్ లో ican IAS acedemy ఆధ్వర్యంలో సివిల్స్, గ్రూప్స్ మరియు పోలీస్ తదితర పోటీ పరీక్షల అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్  ముఖ్య అతిథిగా, డాక్టర్‌ మురళి నాయక్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన జిల్లా అయినటువంటి మహబూబాబాద్ లో ఐఏఎస్ అకాడెమి స్థాపించి ఇక్కడ అభ్యర్ధుల కు అవకాశాన్ని కల్పిస్తున్న ఫౌండర్ రాజేష్ నాయక్ ని మరియు అధ్యాపక బృందం ను అభినందించారు. తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో తన అనుభవాలు పంచుకుంటూ తమిళనాడు లో మామూలు వెనక బడిన గ్రామం నుండి వచ్చిన నాకు చేదు అనుభవాలు ఎదురు అయిన వెనుక అడుగు వేయలేదు అని తెలిపారు. సివిల్స్ అంటే ఢిల్లీ కో చెన్నయ్ కో హైదరాబాద్ కో వెళ్తేనే వస్తుంది అనుకోవద్దు అని తను తొలిసారిగా ఢిల్లీ వెళ్ళింది తన ఐఎఎస్ ఇంటర్వ్యూ కోసమే అని ఒకప్పుడు ఐఏఎస్ పిల్ల లు లేదా ధనవంతుల పిల్ల లు మాత్రమే సాదించే వారని ఇప్పుడు అవకాశాలు అందరికి అందుబాటులో ఉన్నాయి అని పేదరికం ,వెనక బడిన అణగారిన వర్గాలకు చెందిన వారు ఎంతో మంది సివిల్స్ సాధించారు అని తెలిపారు. కావున అభ్యర్థులు అకాడెమి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండర్ రాజేష్ నాయక్  అధ్యాపక బృందం కుమార స్వామి, బద్రి, శ్రీనాథ, సురేష్ , టీమ్ సభ్యులు సుందర్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *