అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం

  • అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం
  • అర చెంచాడు ఐయోడిన్ ఉప్పును ఆహారంలో కలుపుకోవడం ద్వారా అయోడిన్ లోప రుగ్మతలు అరికట్టవచ్చు
ప్రపంచ అయోడిన్ లోప దినం :

అయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లు ప్రపంచంలోని పలు దేశాలల్లో మనకు కనిపిస్తాయి. వీటిపై ప్రజలలో అవగాహన కలిపించి అయోడిన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐయోడిన్ ఎలా దొరుకుతుంది, దానిని ఎందుకు ఆహారంలో కలుపుకోవాలి, దానిపై ఉన్న సందేహాలు వంటి వాటిపై అవగాహన కలిపించడానికి ఏటా 21 అక్టోబర్ నాడు ప్రపంచ అయోడిన్ లోప దినంగా పాటిస్తున్నారు. అయోడిన్ అనేది మానవుని శారీరక, మానసిక ఎదుగుదలకు, అభివృద్దికి అవసరమైన ఎంతో కీలకమైన సూక్ష్మ పోషకం. ప్రతి రోజూ మన తీసుకొనే ఆహారంలో 110-150 మైక్రో గ్రాముల అయోడిన్ ఖచ్చితంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయోడిన్ లోప రుగ్మతలు రావడానికి కారణాలు :

మానవ శరీరం అయోడిన్ ను థైరాయిడ్ హార్మోనులు ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తుంది. అందుకే అయోడిన్ లోపం హైపోథైరాయిడిజమ్ కు కారణమవుతుంది. అయితే థైరాయిడ్ హార్మోన్ లోపం కారణంగా ఎన్నో దుష్పలితాలు సంభవించి తద్వారా పలు జీవ క్రియ సమస్యలు తలెత్తుతాయి. వీటినే అయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లని పేర్కొంటారు.

ఇక అత్యంత ఎత్తైన ప్రదేశాలలో పెంచే ఆహారంలో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే పర్వత ప్రాంతాలతో పాటూ ఎక్కువ వరదలు సంభవించే ప్రాంతాలలోని భూమిలో అయోడిన్ తక్కువగా ఉంటుంది. ఇక అటవీ నిర్మూలన, భూకోతల కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

ఇక పేదరికం, పోష్టికాహార లేమి, పేదరికం కారణంగా దొరికిన ఆహారం తీసుకొనే సందర్భాలలో గోఇట్రోజన్స్ ఎక్కువగా తీసుకోవడం (ముఖ్యంగా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలి, ముల్లంగి వంటి వాటిలో గోఇట్రోజన్స్ ఎక్కవగా ఉంటుంది), కాలుష్యపు నీరు కారణంగా మనం తీసుకొనే ఆహారంలో ఉండే అయోడిన్ ను పేగుల ద్వారా గ్రహించబడి శరీరంలోనికి వెళ్లనీయకుండా అడ్డుకొనే ప్రమాదం ఉంటుంది.

యాంటాజోనిస్ట్ లు – గోఇట్రోజన్స్ అనేవి మొక్కల నుండి లభించే ఆహారంలో ఉండే రసాయిన పదార్థములు. brassica spececies అనబడే మొక్కల రకాలకు చెందిన క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రొకోలి, ముల్లంగి వంటి వాటిలో గ్లూకోసినోలైట్స్ (థియోగ్లూయోసైడ్స్) ఉంటాయి. వీటిలో గోఇట్రోజన్స్ ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన పేగులకు ఐయోడిన్ గ్రహించే శక్తిని అడ్డుకొంటాయి. దీంతో మన శరీరంలో గోయిటర్ అనే రుగ్మత అబివృద్ది చెందుతుంది. అంతే గాకుండా కాలుష్యపు నీటిలో కూడా గోఇట్రోజన్స్ ఉండే అవకాశముంటుంది. గోఇట్రోజన్స్ మన శరీరంలో జరిగే థైరాక్సిన్ సింథసిస్ ప్రక్రియను ప్రభావితం చేసి ధైరాక్సిన్ ప్రక్రియలో ఎంజైమ్స్ ను నిరోధిస్తుంది. ఇది ఐయోడిన్ లోపానికి దారి తీస్తుంది.

అయోడిన్ లోప రుగ్మతలకు సంబంధించిన లక్షణాలు :

అయోడిన్ లోపం కారణంగా చిన్న పిల్లలలో అతి తక్కువ తెలివితేటల సూచి ఉండడంతో పాటూ పెద్ద వారిలో విచక్షణతో కూడిన ఆలోచన శక్తి తగ్గి పని చేసే సామర్థ్యం తగ్గుతుంది.

దీంతో పాటూ ప్రతి రోజూ మనం తీసుకొనే అయోడిన్ 50 మైక్రో గ్రాముల కన్నా తక్కువగా ఉంటే అది గోయిత్రే (Goitre) అనబడే రుగ్మత కారణంగా మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథులలో వాపు చూడవచ్చు. దీంతో పాటూ క్రిటెనిజం (తక్కువ ఎదుగుదల), అలసట, తక్కువ స్థాయిలో జీవ క్రియ, ఆందోళన, గర్భంలో ఉన్న బిడ్డలో మానసిక లోపాలు తలెత్తడం వంటివి అయోడిన్ లోపం కారణంగా ఏర్పడే ప్రధాన రుగ్మతలు.

ఇక గర్భధారణ మరియు బిడ్డలకు పాలు పట్టే సమయంలో అవసరమైనంత థైరాయిడ్ హార్మోనులు ఉత్పత్తి కావడానికి సరైన మోతాదులో అయోడిన్ అవసరం. ఎందుకంటే ఇవి గర్భస్థ పిండం ఎదుగుదలకు మరియు మెదడు అభివృద్దికి కీలకం కాబట్టి.

కోవిడ్‌, రొమ్ముక్యాన్సర్‌ నుంచి ఏకకాలంలో బయటపడ్డ మహిళ

అయోడిన్ లోప రుగ్మతలను అరికట్టడం :

మానవ శరీరం తనంతట తాను అయోడిన్ ఉత్పత్తి చేసుకోదు. శరీరానికి కావల్సిన 60 నుంచి 70 శాతం అయోడిన్ మనం తీసుకొనే ఆహారం మరియు నీటి ద్వారా దొరుకుతుంది. అందుకే అయోడిన్ లోప రుగ్మతలను అరికట్టడానికి మనం తీసుకొనే ఆహారం మరియు నీటి కి అయోడిన్ జోడిస్తారు. ఇందులో భాగంగానే సర్వసాధారణంగా మనం ఆహారంలో కలిపే ఉప్పులో అయోడిన్ కలపడం జరుగుతుంది.

అయోడిన్ లభించే పదార్థములు :

తినే ఉప్పులో అయోడిన్ కలపడమనేది అత్యంత తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా ఐయోడిన్ అందించే ప్రక్రియ. అయితే ఇలా ఉప్పు ద్వారా లభించే ఐయోడిన్ లో 30 శాతం వండేటపుడు కోల్పోయినా మిగిలిన 70 శాతం సమర్థవంతంగా శరీరానికి అందుతుంది. అయితే ఇలా కోల్పోయే అయోడిన్ యొక్క శాతం మనం వండే పదార్థాలు, వండే పద్దతులను బట్టి ఉంటుంది. ఇలా అయోడిన్ కోల్పోకుండా అయోడిన్ కలిపిన ఉప్పును ఆహార పదార్థాలు వండే సందర్భంలో కాకుండా వండిన తర్వాత దాంట్లో కలపడం ద్వారా చూడవచ్చు.

పాల పదార్థములలో కూడా అయోడిన్ ఉంటుంది. అయోడిన్ కలిపిన పాలు, యోగర్టు, ఛీజ్ వంటి వాటి ద్వారా కూడా లభిస్తుంది.

సముద్రపు నీటిలో ప్రతి లీటర్ కు 0.2 మిల్లీ గ్రాముల అయోడిన్ ఉంటుంది. అందుకే చేపలు (కోడ్ మరియు ట్యూనా లాంటివి), సీ వీడ్ అంటే సముద్రపు పాచి, రొయ్యలతో పాటూ ఇతర సముద్రపు ఆహారం లో అయోడిన్ ఎక్కవగా లభిస్తుంది.

చివరి మాట :

సాధారణంగా ప్రజలు అన్ని పోషకాలను తీసుకొనే ఆహారం లోనే తీసుకోగలగాలి. ఒక వేల ఏదైనా పోషకాలు తక్కువబడి అవసరమైన చోట తత్సంబందమైన ఆహార సంబంధిత పదార్థములు మరియు పోషకాలతో నింపబడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పూర్తి చేసుకోవాలి.

అయితే ఏ సందర్భంలోనైనా మీలో అయోడిన్ లోపాన్ని గుర్తిస్తే మాత్రం దాన్ని తగ్గించుకోవడానికి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అయితే సమతుల్యమైన పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోజూ కావాల్సిన అయోడిన్ లోపాన్ని పూరించుకోవచ్చు. ఈ లోపాన్ని నివారించడం ఎంతో సులభం అందుకే వచ్చిన తర్వాత చికిత్స తీసుకొనే దాని కన్నా అది రాకుండా నివారించుకోవడం మంచిది. అందుకే అయోడిన్ వలన కలిగే లాభాలను, లోపం కారణంగా ఏర్పడే ఇబ్బందుల పట్ల ప్రజలలో అవగాహన పెంచిన వారు మంచి ఆహారపు అలవాట్లను చేపట్టడం ద్వారా సరైన పోషకాహారాన్ని తీసుకొనే చూడాలి.

చివరగా డైటీషియన్ గా నా సూచన – మీరు తీసుకొనే ఆహారంలో అర చెంచా (మూడు గ్రాములు) ఐయోడైజ్డ్ సాల్ట్ అంటే అయోడిన్ కలుపబడిన ఉప్పును తీసుకొంటే అది మీ రోజు వారి అయోడిన్ అవసరాలను పూర్తి చేస్తుంది. అంటే మనం తీసుకొనే ఒక గ్లాసు మజ్జిగ (200 ML) లో ఒక అర చెంచా ఐయోడిన్ ఉప్పు కలుపుకుంటే సులువుగా ఈ పని పూర్తవుతుంది.

  • V. Krishna Deepika, Clinical Dietician, Apollo Spectra Hospitals, Kondapur, Hyderabad.

 

One Comment on “అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *