రష్యా వ్యాక్సిన్‌ సురక్షితమేనా? – టీకా రెడీ అయ్యిందా ?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చరిత్రలోనే ఇంతగా ఎదురుచూసిన పరిణామం లేకపోవచ్చు. దేశం, జాతి, కులం, మతం, ప్రాంతం, వయసు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా, ఆసక్తిగా వార్తల అప్‌డేట్స్‌ గురించి తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుందో, ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తుందో అని ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ఏ సమాచారం బయటకు వచ్చినా.. అందరూ అటువైపే దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగానే రష్యా వ్యాక్సిన్‌ గురించి ప్రపంచమంతా చర్చ జరుగుతోంది.

ర‌ష్యా హడావిడిగా విడుద‌ల చేసిన క‌రోనా వ్యాక్సిన్ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. క‌రోనా వైర‌స్ తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ కాలలో ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్‌ను నమోదు చేసింది. ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘స్పుత్నిక్’ పేరుతో వ్యాక్సిన్ విడుద‌ల చేశారు. తొలిటీకా త‌న కుమార్తెకు ఇచ్చామని, ఆమెలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతోందని ప్రక‌టించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందన్న విషయంపై ప‌లు అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రష్యా వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తుందంటే.. ఆ దేశం విడుదల చేసిన నివేదికల ప్రకారం.. వ్యాక్సిన్ ఒక సాధారణ కోల్డ్ వైరస్ అయిన సార్స్‌-కోవిడ్‌-2కు చెందిన అడెనోవైరస్ డీఎన్ఏపై ఆధారపడి ప‌నిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ వైర‌స్‌ను నాశ‌నం చేసే వ్యాధి కారకాలను విడుద‌ల చేస్తుంది. అవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైర‌స్‌ను నాశ‌నం చేస్తాయి.

రష్యా ఇప్పుడు ప్రకటించిన ‘స్పుత్నిక్’ వ్యాక్సిన్‌ వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు తలెత్తవని నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ డైర‌క్టర్ అలెగ్జాండ‌ర్ జింట్స్ బ‌ర్గ్ ప్రకటించారు. ఇందులో వ్యక్తికి అనారోగ్య లక్షణాలు కలిగించేవి ఏవీ లేవని, కాకపోతే, టీకాలు వేయించుకున్న కొందరిలో జ్వరం లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

అయితే, ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ రష్యాకు సూచించింది. వ్యాక్సిన్‌ తయారీతో అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటించాలని కోరింది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రష్యాను హెచ్చరించడాన్ని బట్టి ఈ టీకా అసలు శాస్త్రీయమైనదేనా ? అనే అంశంపై చర్చ జరుగుతోంది.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం రష్యా తయారుచేసిన వ్యాక్సిన్‌ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. కానీ, సిద్ధం కాకముందే వ్యాక్సిన్‌ను ప్రజలపై వదిలారు. ఇంకా ఈ వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలు మనుషులపై జరగలేదు. దీనికితోడు వ్యాక్సిన్‌ను శరవేగంగా అభివృద్ధి చేయాలంటూ రష్యా ప్రభుత్వం ఆటీకా పనిలో ఉన్న నిపుణులపై ఒత్తిడి తెచ్చింది. దీంతో.. ముందు ముందు ఊహించని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఈ వ్యాక్సిన్‌ తొలిదశ ప్రయోగాలు మాత్రమే పూర్తస్థాయిలో వచ్చాయి. అవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొదటి దశలో 76 మందిపై ప్రయోగాలు చేశారు. జూన్‌ 17వ తేదీన ఈ ప్రయోగాలు ప్రారంభించగా ఎవరికీ ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదు. అంతేతప్ప ఆ ప్రయోగాలకు సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ సమాచారం ప్రపంచానికి తెలియదు. దీనిపై రెండోదశ ట్రయల్స్‌.. జూలై 13న ప్రారంభమయ్యాయి. ఆ ట్రయల్స్‌ ఆగస్టు 3వ తేదీన పూర్తయినట్టు ప్రకటించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు. పైగా.. మూడో దశ ట్రయల్స్‌ మొదలుపెట్టక ముందే వ్యాక్సిన్‌ను నమోదు చేసినట్టు ప్రకటించారు.

కానీ, వ్యాక్సిన్‌ తయారీలో మూడోదశ అత్యంత కీలకం. తొలి రెండు దశల్లో వ్యాక్సిన్‌ తక్కువ మందికే ఇస్తారు. వ్యాక్సిన్‌ సురక్షితమని, సమర్థమైందని ఆ దశల్లో తేలిన తర్వతే.. మూడో దశలో వేల మందికి ఇస్తారు. ఇది కొన్ని నెలల తరబడి సాగుతుంది. తొలి రెండు దశల్లో బయటపడని ఏవైనా సమస్యలు ఉంటే ఈ దశలో బయటపడతాయి. రష్యా వ్యాక్సిన్‌ విషయంలో ఈ మూడో దశ పరీక్షలు జరగలేదు. దీంతో.. ఒకవేళ వ్యాక్సిన్‌ సామర్థ్యం తక్కువగా ఉంటే.. ఆ టీకా వేయించుకున్న వారికి వైరస్‌ సోకితే, ఏ మందులకూ, వ్యాక్సిన్లకూ లొంగదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అంశంపై ‘అసోసియేషన్‌ ఆఫ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఆర్గనైజేషన్‌’ అనే సంస్థ.. మూడో దశ ట్రయల్స్‌ పూర్తయ్యేదాకా ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం ఇవ్వొద్దని రష్యా ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ కూడా రష్యాకు చెందినదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ విడుదల చేసిన బుధవారమే మూడోదశ పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. అంటే.. మూడోదశ ప్రయోగాలు బయటకు రాకముందే వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభమయ్యిందన్నమాట. ఓవైపు వ్యాక్సిన్‌పై ప్రయోగాలు సాగుతుండగానే.. మరోవైపు, ఈ టీకాలు వేస్తుంటారు.

4 Comments on “రష్యా వ్యాక్సిన్‌ సురక్షితమేనా? – టీకా రెడీ అయ్యిందా ?”

    1. Russia always TOP in every thing, Russia president Mr Puthin experimented corona vaccina on his daughter, this is great thing , any indian leader is ready to like this.
      Mr Python you are great

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *