నాగభూషణం గౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌లో చేరిక – కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల

బెందె నాగభూషణంగౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వాళ్లందరికీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

25 సంవత్సరాలుగా విశ్వహిందూపరిషత్‌లో, బీజేపీలో, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బెందె నాగభూషణం గౌడ్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడం పార్టీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉండడం శుభసూచకమని వారు అన్నారు. గోదావరిఖనికి చెందిన సీనియర్‌ విహెచ్‌పి నేత బిందె నాగభూషణ్ తో పాటు డివిజన్కు చెందిన సుమారు 100 మంది యువకులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్ధం తీసుకోగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీలో చేరడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి లబ్ధిదారులకు చేరవేస్తూ పార్టీ పటిష్టతకు శ్రమించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు పెద్ద పెద్దపీట వేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో 48 వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్‌తో పాటు డివిజన్ కు చెందిన యువకులు పొన్నం రామ్మూర్తి, బి. అనీష్, వినోద్, నాని లింగమూర్తి, నిఖిల్, సిద్ధార్థ్ మధు, యాకుబ్, సాయి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *