Manipulations in Recruitment : ఉద్యోగ నియామకంలో అక్రమాలకు చెక్‌ పెట్టండి – అధికారుల తీరుపై విచారణ జరిపించండి

Manipulations in Recruitment : ఉద్యోగ నియామకంలో అక్రమాలకు చెక్‌ పెట్టండి – అధికారుల తీరుపై విచారణ జరిపించండి : డిఎంహెచ్‌వోకు దళిత మహిళ వినతి
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు
రాజ్యాంగం కల్పించిన అవకాశం నీరుగారుస్తున్నారు
ఉద్యోగ నియామకంలో జరుగుతున్న లోగుట్టు ఏంటి?
క్వాలిఫైడ్‌ను కాదని నాన్‌ క్వాలిఫైడ్‌కు కట్టబెట్టడంలో మతలబు ఏంటి?
న్యాయం కోసం అర్థిస్తున్న మహిళా అభ్యర్థి

దళిత అభ్యర్థికి దక్కాల్సిన ఓ ఉద్యోగాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిఫైడ్‌ అభ్యర్థికి కాకుండా.. నాన్‌ క్వాలిఫైడ్‌కు పోస్ట్ కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయట. దీనిపై డీఎంహెచ్‌ఓ కార్యాలయం అధికారులకు దళిత సంఘాల నాయకులు, బాధితులు వినతిపత్రం సమర్పించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ వ్యవహారం చర్చకు తీసింది.

మెడికల్‌ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థిని ఉబ్బని శిరీషా జీవన్ కుమార్.. తనకు అన్యాయం జరుగుతుందంటూ దళిత సంఘాల మద్దతుతో డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లి ఆఫీస్‌ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అన్ని అర్హతలు ఉన్న ఉబ్బని శిరిషా జీవన్ కుమార్ దరఖాస్తు చేసిందని చెప్పారు.

మహిళకు రిజర్వ్ అయిన ఆ ఉద్యోగాన్ని అన్ని అర్హతలు కలిగిన దళిత అభ్యర్థిని శిరిషా జీవన్ కుమార్‌కు ఇవ్వకుండా నాన్ క్వాలిఫైడ్ అభ్యర్థికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా ఇప్పటికే అడిషనల్‌ కలెక్టర్‌, రాష్ట్ర ఆరోగ్య సంచాలకులకు వినతిపత్రాలు అందించామని దళిత సంఘాల నాయకులు తెలిపారు.

అంతేకాదు.. పూర్తి ఆధారాలతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ఇటీవలికాలంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ కోసం విడుదల చేసిన ఇతర నోటిఫికేషన్లపైనా తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. నోటిఫికేషన్ ప్రకారం కాకుండా నాన్ క్వాలిఫైడ్, అసలు దరఖాస్తు చేయని వాళ్లకు కూడా దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడు దళిత అభ్యర్థిని ఉబ్బని శిరీషా జీవన్ కుమార్‌కు న్యాయం జరగకపోతే.. దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్రా మహేష్, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి నర్రా శ్రవణ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దార్ల శివరాజ్, నాయకులు చీపురి యాకయ్య, నూనె శ్రీనివాస్, కూరకుల పౌల్, మంద అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్‌ వడ్డి విజయసారథి

FACT CHECK – ఏది నిజం? : తాజ్‌ హోటల్స్‌ బంపర్‌ ఆఫర్‌ – వాలంటైన్స్‌ డే కోసం ఏడు రోజులపాటు ఉచిత బస – వాట్సప్‌ మెస్సేజ్‌లో వాస్తవమెంత?

LOVE JIHAD : లవ్‌ జిహాద్‌… ఏయే రాష్ట్రాల్లో అమలవుతోంది? ఎక్కడ ఎలాంటి నిబంధనలు చేర్చారు?

FACT CHECK – ఏదినిజం? : పాత చిన్ననోట్ల రద్దు నిజమే… ఆర్‌బీఐ ప్రకటనా నిజమే? మరి.. ఈ గందరగోళానికి అసలు కారణమేంటో తెలుసా?

Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్‌ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *