Ration card – Mobile Link : ఎవరికి వారే రేషన్ కార్డ్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.. తెలుసా? ఇలా నమోదు చేసుకోండి.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకుల కోసం వేలిముద్రలను ఉపయోగించే పద్దతికి స్వస్తి చెప్పింది. కరోనా నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెలలపాటు వినియోగదారుల వేలిముద్రలు ఉపయోగించకుండానే సరుకులు పంపిణీ చేసింది.
అయితే, ఈ నెల నుంచి ఒటిపి పద్ధతిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. రేషన్‌కార్డుతో అనుసంధానించిన మొబైల్ నెంబర్‌కు ఒటిపి వస్తుందని, ఆ ఓటిపి చెబితేనే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని ప్రకటించింది. కానీ, ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలామంది రేషన్ కార్డులకు మొబైల్ నెంబర్లు అనుసంధానం కాకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డారు.
కొద్దిరోజుల పాటు.. మీసేవా కేంద్రాల ముందు భారీగా జనం బారులు తీరారు. రేషన్ కార్డు నెంబర్‌కు సెల్‌నెంబర్ అనుసంధానించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. అయితే అందరూ కాకున్నా.. చాలామంది మీసేవా నిర్వాహకులు ఈ అవకాశాన్ని కూడా సొమ్ము చేసుకున్నారు. ఉచితంగా చేయాల్సిన రేషన్‌కార్డు – మొబైల్ నెంబర్ అనుసంధాన ప్రక్రియకు రూ.200 నుంచి రూ.500వరకు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అది కూడా గంటలకు గంటలు క్యూలో నిల్చోవాల్సి రావడంతో జనం కష్టం వర్ణనాతీతంగా మారింది.
ఈ పరిస్థితులతో పాటు.. అన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఐరిస్ గుర్తింపు ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఐరిస్ ద్వారానే రేషన్ సరుకులు ఇప్పటికైతే పంపిణీ చేస్తున్నారు.
అయితే, ముందు ముందు మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోరన్న గ్యారెంటీ లేదు. కాబట్టి రేషన్ కార్డుతో సెల్‌నెంబర్‌ను అనుసంధానించుకుంటే సరిపోతుంది. ఆ ప్రక్రియ ఎవరికి వారే సొంతంగా చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగానే.. ఒకే ఒక్క నిమిషంలో ఆ పని పూర్తి చేసుకోవచ్చు .
దానికి ఏం చేయాలో కింది స్టెప్పులను అనుసరించండి.
1) ముందుగా https://scm.telangana.gov.in/SCM/login.html లింక్‌పై క్లిక్ చేయండి.
2) అందులో లాగిన్ వివరాల కింద SMS Registration అని మొబైల్ ఇమేజ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
3) అప్పుడు https://scm.telangana.gov.in/SCM/Registration.jsp ఈ లింక్ వస్తుంది.
4) అందులో
– మొబైల్ నెంబర్
– ఫస్ట్ నేమ్
– లాస్ట్ నేమ్
– స్టేట్
– డిస్ట్రిక్ట్
– మండలం
– FP షాప్ నెంబర్
– బెనిఫిషరీ కేటగిరీ దగ్గర పబ్లిక్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
5) ఈ వివరాలన్నీ ఎంటర్ చేశాక Submit నొక్కండి.
Benificiary Registered SuccessFully అని మరో విండో ఓపెన్ అవుతుంది.
అంతే.. మీ రేషన్ కార్డుతో మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే…
ఈ కథనాన్ని కింది వీడియోలో చూడండి.