రష్యా క్లినికల్‌ ట్రయల్స్‌పై ఇటలీ శాస్త్రవేత్తల అనుమానాలు

రష్యా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ రిపోర్ట్‌, లెక్కల విషయంలో ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ క్లినికల్‌ ట్రయల్స్ గురించి ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ల్యాన్సెట్‌లో రష్యా విడుదలచేసిన ఓ నివేదికను ప్రచురించారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌లో రష్యా పేర్కొన్న విధంగా గణాంకాలు నమోదవడం దాదాపు అసాధ్యమని ఇటలీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. …

Read More

కరోనాని జయించిన 108 ఏళ్ల బామ్మ : మానసిక స్థైర్యమే అసలు చికత్స

– భయంతో కుంగిపోతున్న వాళ్లకు ఆదర్శం ఆ వృద్ధురాలిపేరు దులారీ దేవి. వయసు 108 సంవత్సరాలు. ఉత్తరప్రదేవ్‌లోని ఆజయ్‌గఢ్‌లోని బలియాలో నివాసం. కరోనా వైరస్‌ సోకడంతో ఆజమ్‌గఢ్‌లోని మెడికల్‌ కాలేజీలో చికత్సకోసం చేర్చారు. అయితే తొమ్మిదంటే తొమ్మిది రోజుల్లోనే ఆ బామ్మ పూర్తిగా కోలుకొని హుషారుగా ఇంటికి వెళ్లింది. వృద్ధురాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ కరోనా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరూ …

Read More

కరోనా సోకిన వైద్యుడితో రోగులకు చికిత్స – అధికారుల అమానుషత్వానికి పరాకాష్ట

జనగామ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా సో కిన వైద్యుడితో  రోగులకు అధికారులు చికిత్స చేయించారు. జిల్లా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా సోకింది. కరోనా వచ్చిందన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాడు. సెలవు మంజూరు చేయాలని విజ్జప్తి చేశాడు. ఆత్మహత్యల నివారణ దినం రోజే కుటుంబమంతా బలవన్మరణం కానీ, అధికారులు మాత్రం డ్యూటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమి …

Read More

చిన్నారులు మాస్కులు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలు

కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ముఖానికి మాస్కు ధరించడం కీలకమైనది. మన దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు ముఖానికి మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం ఐదేళ్లలోపు పిల్లలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలంతా మాస్కులు …

Read More

పార్లమెంటునూ వెంటాడుతున్న కోవిడ్‌ భయం – సెప్టెంబర్‌ 14 నుంచి సెషన్స్‌

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 1వ తేదీవరకు సభ కొనసాగనుంది. షరా మామూలుగానే కోవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఇరు సభలలో సభ్యులకు స్ధానాలను కేటాయిస్తున్నారు. ఇక లోకసభ సభ్యులందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమవుతారని, రాజ్యసభ …

Read More

కరోనా గురించి మరో షాకింగ్‌ నిజం – జర జాగ్రత్త గురూ!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. కరోనా లక్షణాలు కూడా కొత్త కొత్తవి బయటపడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా, షాకింగ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. అయితే, ఈ కేసుల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు …

Read More