కలియుగంలోనే ప్రధాన ఘట్టం – అయోధ్యలో అంకురారోపణం

శ్రీరాముడు.. హిందూ సంస్కృతిలో, హిందూ సమాజంలో తిరుగులేని పాత్ర. రాజుగా, పాలకుడిగా, దేవుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న శ్రీరామచంద్ర ప్రభువు. త్రేతాయుగంలో నడయాడిన శ్రీరాముడి గురించి… ఇప్పుడు కలియుగంలో ఓ ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటున్న సందర్భం… కొద్దినెలలనుంచి విస్తృతంగా వార్తల్లో, ప్రచారంలో నిత్యం చోటు చేసుకుంటున్న చరిత్ర నేపథ్యం. అయితే… ఈ పరిణామాలకు, చర్చలకు ప్రధాన కారణం అయోధ్య. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో రామమందిరం పునర్మిర్మాణానికి సుముహూర్తం ఖరారైంది. …

Read More

అయోధ్య, శ్రీరాముడి గురించి అనుమానాలున్నాయా ?

అయితే ఈ వివరాలు తెలుసుకోండి ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీ రాముడు. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా జన్మించారని హిందువులు నమ్ముతారు. భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణం వైపు చాలా ప్రాంతాలలో, …

Read More

అయోధ్య రామమందిరం గురించి అలహాబాద్‌ కోర్టు ఏంచెప్పింది ?

అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు: 1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ 2. జస్టిస్ సుధీర్ అగర్వాల్ 3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు ఇచ్చిన తేది : 2010 సెప్టెంబరు 30 తీర్పు వివరాలు: * మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు. * ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు …

Read More

అయోధ్య భూమిపూజ షెడ్యూల్‌ – వేదిక స్వరూపం ఇదీ…

– ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజ చారిత్రక ఘట్టంకోసం ఉదయం 11:15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు. – తొలుత హెలికాప్టర్‌లో సాకేత్ యూనివర్శిటీకి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మొట్ట మొదట హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భూమి పూజకు బయల్దేరతారు. …

Read More

అయోధ్య రామమందిరం కోసం 500 యేళ్లుగా పోరాటం

క్రీ.శ.1528లో మొగల్‌ రాజు బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. దీంతో హిందువులు ఆగ్రహోదగ్రులయ్యారు. అయోధ్య ఆలయాన్ని ముస్లింల వశం కాకుండా శక్తివంచన లేకుండా పోరాటాలు సాగించారు. ఫలితంగా క్రీ.శ.1528 నుండి క్రీ.శ.1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ హిందువుల పవిత్ర స్థలమైన అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 1990వ దశకంలో …

Read More

అయోధ్యలో శ్రీ రామజన్మభూమి దేవాలయ చరిత్ర ఇదీ…

– శ్రీ రామచంద్రుడు స్వర్గారోహణం చేసినప్పుడు అయోధ్యలోని భవనాలు, దేవాలయాలు సరయూలో మునిగిపోయాయని ప్రతీతి. చాలాకాలం ఆ ప్రాంతం బీడుపడి ఉందని శాస్త్రగ్రంథాలు చెపుతున్నాయి. – కొంత కాలానికి కుశావతి(కౌశాంబి)ని పాలించిన మహారాజ కుశుడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్థాపించాడని కాళిదాసు ‘రఘువంశం’ అనే కావ్యంలో పేర్కొన్నాడు. – మహారాజ కుశుడు శ్రీ రామజన్మభూమిలో ఒక భవ్యమైన మందిరాన్ని కట్టించాడని లోమశ రామాయణం చెబుతోంది. – శిథిలమైన అయోధ్యను …

Read More

రామమందిరం కూల్చి మసీదు.. ఇవిగో ఆధారాలు

అయోధ్యలో ప్రస్తుతం ఆలయం నిర్మిస్తోన్న ప్రదేశంలోనే ఒకప్పుడు విశాలమైన రామాలయం ఉండేదని అనేక యేళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. హిందువుల పవిత్ర స్థలమైన రామమందిరాన్ని కూల్చివేసి.. ముస్లిం పాలకులు అక్రమంగా మసీదు నిర్మించారన్న వాదనలు న్యాయస్థానాల్లో మారుమోగాయి. అయితే.. అక్కడ అసలు రామమందిరం ఉండేదా ? నిజంగానే ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారా ? అన్న విషయంలో చాలాయేళ్లు సందిగ్ధం సాగింది. ఆధారాలకోసం వేట కొనసాగింది. చివరకు అక్కడ ఓ …

Read More