అంతర్వేది రథం కూలిన ఘటనకు సంఘీభావంగా చిలుకూరు బాలాజీ దేవాలయంలో  ధర్మ రక్షణ జ్యోతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంతర్వేదిలో రథం కాలిన తర్వాత భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు.. సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో అందరూ దీపాన్ని వెలిగించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ ధ్యానం చిలుకూరు బాలాజీ ఆలయంలోని ముఖ మంటపంలో …

Read More

అంతర్వేది ఘటన సీబీఐ దర్యాప్తు నిర్ణయంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌ : ఇది తొలి అడుగు మాత్రమే…

అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తునకు  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించడం అంటే సమస్య పరిష్కారం అయినట్టు కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే అని అభివర్ణించారు. ఈమేరకు తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ సీఎం జగన్  రెడ్డి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌. అయితే, అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కావద్దని పవన్ …

Read More

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఏపీ సర్కారు నిర్ణయం

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగుతోంది. హిందూసంస్థలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. విపక్షాల విమర్శలు, నిరసనలతో రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికి పోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. …

Read More