
అరకులో హైదరాబాద్ వాసి దుర్మరణం
విశాఖ జిల్లా అరకులో అపశృతి దొర్లింది. హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యాటకుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. అరకులోయ సమీపంలోని అనంతగిరి తాటిగూడ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. అనంతగిరి మండలంలోని తాటిగూడ జలపాతం సమీపంలో మరో జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గరికి వెళ్లిన యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ రాయిపైనుంచి జారిపడ్డాడు. దీంతో.. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని హైదరాబాద్‌కు చెందిన రాణా ప్రతాప్‌గా గుర్తించారు.
Read More