Page Nav

HIDE

Grid

GRID_STYLE

భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండండి- సి.ఎస్. సోమేశ్ కుమార్ తో సమీక్షించిన సి.ఎమ్. కేసీఆర్

- రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులపై సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ తో సమీక్ష.  - గులాబీ తూఫాన్ ప్రభావంతో ...

- రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులపై సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ తో సమీక్ష. 
- గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగా కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ ను కోరిన సీఎం.
- పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సిఎం స్పష్టం.
- రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్.
- టెలీ కాన్ఫరెన్స్ లో సిఎస్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు హాజరు.
- రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎస్.
 - జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన.
- ప్రాణ ఆస్తి నష్టం కలుగ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టరాలని సోమేశ్ కుమార్ స్పష్టం.
- హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నా సీఎస్.
- ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలన్నా సీఎస్.
- సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికకారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ ఆదేశం.
- డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపిన సీఎస్.

No comments