Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : గులాబ్ ధాటికి తడిసి ముద్దైన భాగ్యనగరంఎక్కడెక్కడ వర్షాలు కొట్టాయో తెలుసా?

కోఠి, సుల్తాన్‌బజార్‌, పాతబస్తీ పరిసరాల్లో భారీ వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీలో వర్షం కురిసింది.నిజాంపేట్...

కోఠి, సుల్తాన్‌బజార్‌, పాతబస్తీ పరిసరాల్లో భారీ వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీలో వర్షం కురిసింది.నిజాంపేట్, ప్రగతి నగర్‌ పరసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బి.ఎన్‌.రెడ్డి నగర్, తుర్కయాంజాల్‌లో వర్షం పడుతోంది.హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో, బోరబండ, అల్లాపూర్, మోతీ నగర్, ఎర్రగడ్డలో వర్షం కురుస్తోంది.సనత్‌నగర్, ఈఎస్‌ఐ, రహమత్ నగర్, అమీర్‌పేటలో వర్షం కంచి కొడుతోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది.భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.భారీ వర్షంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు.

టోలి చౌకి, షేక్ పేట్, మణికొండ, గోల్కొండలో దంచికొడుతున్న వర్షం పడుతోంది. మెహదీపట్నం, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్ లో భారీ వర్షం కురుస్తోంది.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షం పడుతోంది.

శేరిలింగంపల్లి, మాదాపుర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం జనాన్ని ఇబ్బందులు పెడుతోంది. ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ నాగారం కీసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.


నగర వ్యాప్తంగా కుండపోత వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. జలదిగ్బంధంలో అనేక కాలనీలు చిక్కుకుపోయాయి. నాన్ స్టాప్ వర్షంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.ఖాజా గూడా నుంచి మెహదీపట్నం మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లమీద ఎక్కడికక్కడ నిలిచిపోయిన వర్షపు నీటితో వాహనదారుల అవస్థల పడుతున్నారు.


పీ అండ్ టీ కాలనీ నుంచి దిల్ సుఖ్ నగర్ సాయి బాబా దేవాలయం ముందు నుంచి పోటెత్తిన వరద నీటితో రోడ్డు నదిని తలపిస్తోంది. నీట మునిగిన చాదర్ ఘాట్ బ్రిడ్జి.. మలక్ పేట్ గంజ్ మార్కెట్ దృశ్యాలు వైరల్ గా మారాయి.


హైదరాబాద్ బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నీట మునిగిన వాహనాలతో.. జనం అవస్థలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపధ్యం లో పోలుసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ సమయంలో అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100 కి సమాచారం ఇవ్వండని కోరారు. లోతొట్టు ప్రాంతాలు, కాలనీలు పై ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా కింద స్థాయి సిబ్బందిని అలెర్ట్ చేశామన్నారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ కాలనీలోని పలు ఇళ్ళలోకి వర్షపు నీరు భారీగా వచ్చిచేరాయి. ఈ రోజు ఉధయం నుండి కురుస్తున్న వర్షానికి ఉస్మాన్ నగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఉస్మాన్ నగర్ సమీపంలోని బురాన్ ఖాన్ చెరువు నిండుకుండలా మారడంతో స్థానికుల ఇళ్ళలోకి నీరు వచ్చిచేరుథున్నాయి. బస్తీ లోని రోడ్లన్నీ వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి.


No comments