Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : హైదరాబాదులో ఎక్కడ ఎంత వర్షం పడిందో తెలుసా?

గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ...


గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు బంగాళాఖాతం పొడవున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. 

ఇక హైదరాబాద్ నగరం జలమయం అయిపోయింది. నగరమంతటా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయ్. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఈ భారీ వర్షాలతో అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్ష బీభత్సం ఎఫెక్ట్ ప్రజలపై పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలోనే వాతావరణ శాఖ వర్షపాతం వివరాలను వెల్లడించింది. హైదరాబాదులో ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురిసింది వివరాలు రిలీజ్ చేసింది. ఆ వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

చర్లపల్లి హెల్త్ సెంటర్ 7.2cm  
 కాప్రా 7cm  
మచ్చబొల్లారం 6.4cm
 కుషాయిగూడ 6.1cm
 మాదాపూర్ 6cm 
బంజారాహిల్స్ 5.7cm 
ఇలా హైదరాబాద్ అంతట వర్షం దంచికొడుతోంది.


ఇంకా ఎక్కడెక్కడ వర్షం పడుతుందో, పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.,.

*ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిన ఐటి కారిడార్....*


గచ్చిబౌలి,రాయదుర్గం,మాదాపుర్, పైనాన్షియల్ జిల్లా నానక్ రామ్ గూడా,గోపన్ పల్లి,కోండాపుర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయం.... 

మాదాపుర్ లోని అమర్ సొసైటీ,నేక్టార్ గార్డెన్ కాలనిలలో భారీగా చేరిన వరద నీరు....

మాదాపుర్ సిఓడి వద్ద వరద నీరు ప్రధాన రహదారిపై చేరడంతో రాకపోకలకు అంతరాయం....

జుబ్లీహిల్స్ నుంచి మాదాపుర్ హైటెక్ సిటీ చౌరస్తా వైపు వేళ్లె వాహనాలను మాదాపుర్ పోలిస్ స్టేషన్ సమీపంలో మళ్లీస్తున్న ట్రాఫిక్ పోలీసులు....

జుబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలను కేబుల్ బ్రిడ్జి వైపు మళ్లింపు....



No comments