Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : హైదరాబాద్ లో హై అలర్ట్ - కంట్రోల్ రూమ్ నెంబర్ ఇదే...

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది.  ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. మరో నాలుగైదు గంటలపాటు హైద...


హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది.

 ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. మరో నాలుగైదు గంటలపాటు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 అవసరమైతే తప్ప బయటకు రావొద్దని GHMC సూచించింది. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు కోరారు.

 ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు అప్రమత్తం 
 లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయ్యింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైదరాబాదులో హైఅలర్ట్ ప్రకటించింది.

 తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారుల సూచించారు. 

No comments