Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : నీటమునిగిన హైదరాబాద్ పాతబస్తీ

హైదరాబాద్ పాతబస్తీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి, రోడ్ల పైన వరద నీటితో పాటు మురుగు నీర...

హైదరాబాద్ పాతబస్తీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి, రోడ్ల పైన వరద నీటితో పాటు మురుగు నీరు ప్రవహిస్తుంది. పాతబస్తీ నీట మునిగి పోయింది.

ముఖ్యముగా బడదూర్పురా నుండి కిషన్ బాగ్ వెళ్లే రహదారిలో వర్షపు నీటితో పాటు నాలా ఓవర్ ఫ్లో అయి రోడ్ పై నడుములోతు నీరు చేరింది, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ టీంలు చేరుకొని నీటిని మ్యాన్ హొల్స్ ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు,

ఛత్రినాక, శివాజీ నగర్, గంగా నగర్ ప్రాంతంలో వరద నీటితో పాటు, డ్రైనేజీ నీరు రోడ్డు, విధులలో నీరు భారీగా ప్రవహిస్తుంది,

చంద్రాయనగుట్ట నుండి హష్మబాద్ వెళ్లే రహదారి పై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది,

యకుత్పురా రైల్వే బ్రిడ్జి క్రింద వర్షపు నీరు చేరుకోవడంతో నిలిచిపోయిన రాకపోకలు,

చార్మినార్ వద్ద కూడా వర్షపు నీరు రోడ్ పై ప్రవహిస్తుంది.

No comments