Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : తప్పుడు వార్తల పాలిట సింహస్వప్నం - ఫేక్‌న్యూస్‌ అరికట్టడమే ధ్యేయం

సోషల్‌ మీడియా రెండు వైపులా పదునున్న పవర్‌ ఫుల్‌ కత్తి.  అలాంటి సోషల్ మీడియాను ఫేక్‌ న్యూస్‌కు అడ్డాగా మారుస్తున్నారు కొందరు. ఈ సంస్కృతికి ఫు...

సోషల్‌ మీడియా రెండు వైపులా పదునున్న పవర్‌ ఫుల్‌ కత్తి.  అలాంటి సోషల్ మీడియాను ఫేక్‌ న్యూస్‌కు అడ్డాగా మారుస్తున్నారు కొందరు. ఈ సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెడదాం. ఫేక్‌ న్యూస్‌ను అరికడదాం. తరిమితరిమి కొడదాం...


- తప్పుడు వార్తల నిర్మూలనే ధ్యేయం
- ఫేక్‌న్యూస్‌ అరికట్టడమే ఆశయం
-  ప్రజలు దారి మళ్లకుండా చూడటమే లక్ష్యం
- యూత్‌ శక్తిసామర్థ్యాలు గుర్తు చేయడమే కర్తవ్యం

 

ఫేక్‌ న్యూస్‌.. తప్పుడు వార్త. వినడానికి సాధారణంగానే అనుకున్నా.. ఓ మహమ్మారి మాదిరిగా తయారయ్యిందీ బెడద. సోషల్ మీడియాను నిలువునా ఆవరించింది. ప్రజలను నిత్యం తప్పుదోవ పట్టిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను మైకంలోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత ఈ ఫేక్‌న్యూస్‌ వరదలో పడి కొట్టుకుపోతోంది. గమ్యం తెలియక, ఆశయం గుర్తించక, లక్ష్యమేంటో తెలుసుకోలేక సోషల్‌ మానియాలో పడిపోతోంది. ఫలితంగా నాణ్యమైన, ఆచరణాత్మకమైన ఆలోచనలు కనుమరుగవుతున్నాయి. మస్తిష్కం మొద్దుబారిపోతోంది.


ఫేక్‌న్యూస్‌తో అనేక దుష్పరిణామాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యకర వాతావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది. వాస్తవం అయినా కాకపోయినా ప్రతి దానినీ అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిణామాలకు చెక్‌ పెట్టి జనం ఫేక్‌న్యూస్‌ ప్రవాహంలో కొట్టుకుపోకుండా.. వాస్తవాలను ఎవరికి వారు నిర్ధారించుకునేలా చేయడమే ఫ్యాక్ట్‌ఫుల్‌ ప్రధాన ఉద్దేశ్యం.

 

అయితే, తప్పుడు వార్తల గుర్తింపు, నివారణే ప్రధాన లక్ష్యమైనప్పటికీ.. ఫ్యాక్ట్‌ఫుల్‌లో అన్నిరకాల వార్తలు, విశ్లేషణలు కూడా అందిస్తాము. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, వార్తలు, వార్తా సమీక్షలు, వార్తల వెనుక దాగి ఉన్న నిగూఢాలు కూడా విశ్లేషిస్తాము. రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌, హెల్త్‌ న్యూస్‌ కూడా ఎప్పటికప్పుడు అందిస్తాము. జాతీయ, అంతర్జాతీయ వార్తలనూ మీ ముందుకు తెస్తాము. 

 

ఈ క్రమంలో ఒక్కోసారి మీ అంచనాలు అందుకోలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అవసరమైన సలహాలు ఇస్తూ.. అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.


factful.in రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇక, దూసుకుపోవడమే మిగిలింది.



సో.. లెట్‌ రెడీ.. గో...


- Team Factful