Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact ful : హుజురాబాద్‌ షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌

తెలంగాణలో రాజకీయాలను హీటెక్కిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారయ్యింది. కొన్నాళ్లుగా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందిగ్ధ...



తెలంగాణలో రాజకీయాలను హీటెక్కిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారయ్యింది. కొన్నాళ్లుగా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందిగ్ధం నెలకొంది. ఆ సందిగ్ధానికి ఇప్పుడు తెర పడింది.


తెలంగాణలోని హుజురాబాద్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ ఉప ఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. హుజురాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాలకు ఒకే షెడ్యూల్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30వ తేదీన ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి ఈయేడాది జూన్‌ 12వ తేదీన ఈటల రాజేందర్‌ రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అదే విధంగా బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ యేడాది మార్చి 28వ తేదీన మృతిచెందడంతో.. బద్వేల్‌లోనూ ఉప ఎన్నిక జరుగుతోంది.

ఇక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్‌ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

ఉప ఎన్నిక షెడ్యూల్‌ వివరాలివే... 


- అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
- అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13
- అక్టోబర్ 30వ తేదీన పోలింగ్
- నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన


No comments