Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : నిమజ్జన రూట్‌మ్యాప్‌లో ఆకట్టుకుంటున్న గణపతి తొండం

గణపతి నవరాత్రోత్సవాలు. ఊరూ వాడా ఆధ్యాత్మిక లోగిలిలో మునిగితేలే సందర్భం. చిన్నా పెద్దా అందరూ భక్తితో వినాయకుడిని కొలిచే సమయం. హైదరాబాద్‌లో అత...



గణపతి నవరాత్రోత్సవాలు. ఊరూ వాడా ఆధ్యాత్మిక లోగిలిలో మునిగితేలే సందర్భం. చిన్నా పెద్దా అందరూ భక్తితో వినాయకుడిని కొలిచే సమయం. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. గణపతి నవరాత్రోత్సవాలు భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిమజ్జనం రోజు ఇవే బాధ్యతల్లో మునిగి తేలతారు. ఇక.. వినాయక నిమజ్జనం రోజు హైదరాబాద్‌లో రోడ్లన్నీ బంద్‌ అవుతాయి. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ప్రత్యేకంగా పోలీసు డిపార్ట్‌మెంట్‌ వినాయక నిమజ్జనం కోసమే రూట్‌మ్యాప్ తయారు చేస్తుంది. ప్రతియేడూ మాదిరిగానే ఈయేడాది కూడా రూట్‌ మ్యాప్‌ విడుదల చేశారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు.

అయితే, ఈ యేడాది రూట్‌మ్యాప్‌ చూడగానే.. ఓ అద్భుత ఆలోచన మస్తిష్కంలో పుట్టుకొస్తోంది. ఈ మ్యాప్‌లో వినాయకుడి తొండం ఆకారం ప్రస్ఫుటమవుతోంది. ఖండాంతర ఖ్యాతి గాంచిన బాలాపూర్‌ గణేషుడి రూట్‌ మ్యాప్‌ వినాయకుడి తొండాన్ని సూచిస్తోంది. పలు రూట్లను తయారు చేసిన పోలీసులు.. అన్నిరూట్లను బ్లూ కలర్‌లో సూచించారు. ఒక్క బాలాపూర్‌ రూట్‌ను మాత్రం కాషాయవర్ణంలో చూపించారు. అది అచ్చం వినాయకుడి తొండాన్ని పోలి ఉంది. కలర్‌ మార్చడం వల్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

తొండం మాత్రమే కాదు.. కేవలం రూట్‌ మ్యాప్‌తోనే వినాయకుడి రూపాన్ని కూడా ఇమిడ్చేలా చేశారు డిజైనర్‌. ఆ రూట్‌మ్యాప్‌ ఎవరు తయారు చేశారో గానీ, క్లైమాక్స్‌లో అదరగొట్టేశారు. నిమజ్జనాన్ని కూడా భక్తిభావంతోనే ముగించేలా రూపకల్పన చేశారు.

ఆ డిజైనర్‌కు, ఆ టీమ్‌కు ఫ్యాక్ట్‌ఫుల్ హ్యాట్సాఫ్‌ చెబుతోంది.

No comments