Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factcheck - ఏదినిజం ? : తిరుమల కొండల్లో అతిభారీ అనకొండ నిజమేనా ? క్రేన్‌తో తరలిస్తున్న ఈ భారీ పాము ఎక్కడిది ?

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు సినిమాల్లో తప్ప నేరుగా ఎప్పుడూ చూడని భారీ పామును ఓ క్రేన్‌ సాయంతో పైకి లేపుతున్న దృశ్యం...




సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు సినిమాల్లో తప్ప నేరుగా ఎప్పుడూ చూడని భారీ పామును ఓ క్రేన్‌ సాయంతో పైకి లేపుతున్న దృశ్యం అది. ఆ వీడియోలో పామును చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియోను చూసిన వాళ్లందరిలోనూ అదెక్కడో తెలుసుకోవాలన్న ఆసక్తి  కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పాము అంటూ ప్రచారం జరిగింది.


25 సెకనుల నిడివి ఉన్న ఆ వీడియో అనేక వాదనలతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రచారం అవుతోంది. మొదట టిక్‌టాక్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత దీనిని ఇతర సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ చేశారు. 





తిరుమల కొండల్లో ఆ పాము కనిపించిందని, దాన్ని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారని కొందరు వైరల్‌ చేశారు.

వైరల్‌ అవుతున్న మెస్సేజ్‌ సారాంశం ఈ కింద చూద్దాం...

7కొండల్లో 32అడుగుల కొండచిలువ
తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది.


 




పామును పైకెత్తిన ఎంపీ :


సామాన్యులే కాదు.. ఏకంగా ఓ ఎంపీ కూడా ఇది భారత్‌లోని దృశ్యమంటూ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై పోస్ట్‌ చేశాడు.
 


 
రాజ్యసభ సభ్యుడు, పరిమల్ నత్వానీ, ఈ వీడియోను తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై పోస్ట్‌ చేశారు. '100 కిలోల బరువు మరియు 6.1 మీటర్ల పొడవున్న ఈ కొండచిలువను జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గుర్తించారు. దీనిని తరలించడానికి క్రేన్ ఉపయోగించాల్సి వచ్చింది.' అని రైటప్‌ ఇచ్చారు.

Factcheck - ఏదినిజం?

 అయితే, ఈ పామును తరలించే వీడియో ఎక్కడిదన్న విషయంపై Factful ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది. ఈ పరిశోధనలో ఈ పాము వీడియో Nature and Heritage యూట్యూబ్‌ ఛానెల్‌లో కనిపించింది. అలాగే, ఈ పామును తరలించిన దృశ్యం ఎక్కడ రికార్డ్‌ చేశారో కూడా తెలిసింది.

ఈ భారీపాము ఎక్కడిది?

కరేబియన్‌లోని డొమినికా ఫారెస్ట్‌లోనిదీ వీడియో. అక్కడ పనిచేస్తున్న వాళ్లకు ఈ భారీ అనకొండను పోలిన సర్పం కనిపించింది. వెంటనే వాళ్లంతా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. రంగంలోకి దిగిన అధికారులు.. ఆ పాముకు హాని చేయకుండా.. సురక్షితంగా అడవుల్లో వదిలివేయాలని నిర్ణయించారు. అందుకే క్రేన్‌ సాయంతో ఆ పామును తరలించారు. ఆ తరలించే సమయంలో దూరంనుంచి వీడియో రికార్డ్ చేశారు.

==========================================

ప్రచారం : తిరుమల కొండల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ కనిపించింది.

వాస్తవం : కరేబియన్‌లోని డొమినికా ఫారెస్ట్‌లో ఈ భారీ కొండచిలువను గుర్తించారు. సురక్షితంగా ఇతర ప్రాంతానికి తరలించేందకు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది.  

కంక్లూజన్‌ : నిజంగానే.. సినిమాల్లో తప్ప ఇంత పెద్ద పామును దాదాపు ఎవరూ చూసి ఉండరు. దీంతో, సహజంగానే ఈ వీడియో చూసిన వాళ్లందరిలో ఓ రకమైన ఉత్సాహం కనిపించింది. అయితే కొందరు దీనిని, ఫేక్‌న్యూస్‌గా క్రియేట్‌ చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించారు.
=========================================

No comments