Page Nav

HIDE

Grid

GRID_STYLE

తిరుచానూరు పద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

           తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కో ర...

           తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు.


            ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ఊంజల్‌సేవ నిర్వహించారు.

              అక్టోబరు 15వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనంపై అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

No comments