Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact check - ఏదినిజం? : అమూల్‌ ఆరువేల రూపాయలు ఇస్తుందా? ఎలా గెలుచుకోవచ్చో తెలుసా?

అమూల్‌ పాల గురించి అందరికీ తెలుసు. మన దేశంలో అతిపెద్ద పాలు, పాల ఆధారిత ఉత్పత్తుల సంస్థ. ఆ సంస్థ పేరిట ఓ మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంద...

అమూల్‌ పాల గురించి అందరికీ తెలుసు. మన దేశంలో అతిపెద్ద పాలు, పాల ఆధారిత ఉత్పత్తుల సంస్థ. ఆ సంస్థ పేరిట ఓ మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో ఈ మెస్సేజ్‌ తిరుగుతోంది. అది చూసిన వాళ్లు గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేస్తున్నారు. కేవలం ఆ లింక్‌ను షేర్‌ చేస్తే తమకు ఆరువేల రూపాయలు వస్తాయని సంబరపడిపోతున్నారు.

Factful నిజ నిర్ధారణ :

వాట్సప్‌లో తిరుగుతున్న ఈ లింక్‌ను Factful గమనించింది. ఇలాంటి లింకులు ఫిషింగ్‌ లింకులని గతంలోనే అనేక సార్లు Factful నిజ నిర్ధారణ చేసి తేల్చింది. అయితే, సోషల్ మీడియా యూజర్లకోసం మరోసారి ఈ లింక్‌పైనా అధ్యయనం చేసింది. వాట్సప్‌లో తిరుగుతున్న ఈ లింక్‌ను ఓ సారి చూద్దాం...

ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే ఓ విండో ఓపెన్‌ అవుతోంది. అందులో హోమ్‌పేజీలో అమూల్‌ లోగోతో ఓ ఇమేజ్‌ ప్రత్యక్షమవుతోంది. అందులో అమూల్‌ 75వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే.. 6వేల రూపాయలు గెలుచుకుంటారని పేర్కొంటోంది. దీనిని గమనించిన వాళ్లు.. ఆశతో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అవన్నీ చాలా సులువైన ప్రశ్నలే కావడంతో అందరూ చివరి దాకా చేరుకుంటున్నారు. ఆ తర్వాత.. ఈ లింక్‌ను పది వాట్సప్‌ కాంటాక్ట్స్‌కు, నాలుగు వాట్సప్‌ గ్రూపులకు పంపించాలని సూచిస్తోంది. ఆ తర్వాత తిరిగి హోమ్‌పేజీ ఓపెన్‌ అవుతోంది. అంటే.. అందరికీ ఆ లింక్‌ను షేర్‌ చేసిన తర్వాత గానీ, అది తప్పుడు లింక్‌ అని తెలుసుకోలేకపోతున్నారు. అప్పటికి గానీ రియలైజ్‌ అవుతున్న వారు.. కొందరు తిరిగి వాట్సప్‌గ్రూపుల్లో ఇది తప్పుడు లింక్‌ అని, ఎవరూ ఓపెన్‌ చేయొద్దని పోస్ట్‌ చేస్తున్నారు కూడా.

ఇలా తప్పుడుగా తయారుచేసిన లింక్‌లు ఫిషింగ్‌ లింకులు. కొన్ని సార్లు ఆ లింకులు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి. బ్యాంకుల వివరాలు దొంగిలించి ఖాతాలను కూడా ఖాళీ చేసేస్తాయి. కాబట్టి ఇలాంటి లింకులపట్ల ఎవరూ ఆకర్షితులు కావొద్దని ఫ్యాక్ట్‌ఫుల్‌ సలహా ఇస్తోంది.
=======================
ప్రచారం : అమూల్‌ కంపెనీ తన 75వ వార్షికోత్సవం సందర్భంగా 6వేల రూపాయల బహుమతి అందజేస్తోంది.

వాస్తవం : ఇది తప్పుడు లింక్‌. అమూల్‌ సంస్థ ఎలాంటి బహుమతి ఇవ్వడం లేదు. సైబర్‌ నేరగాళ్లు ఈ లింక్‌ను వైరల్‌ చేస్తున్నారు.

కంక్లూజన్‌ : ఇలాంటి లింకుల వల్ల మన సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తారు. ఫలితంగా మన సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
=======================

No comments