దీపావళి. దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పర్వదినం. ఈ పేరు వింటేనే గుర్తొచ్చేవి టపాసులు. దీపావళి అంటేనే టపాసులు.. టపాసులు అంటేనే దీపావళి...
దీపావళి. దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పర్వదినం. ఈ పేరు వింటేనే గుర్తొచ్చేవి టపాసులు. దీపావళి అంటేనే టపాసులు.. టపాసులు అంటేనే దీపావళి. ఎందుకంటే టపాసులు కాల్చితేనే ఈ పండుగ జరుపుకున్నట్టు అందరూ భావిస్తారు.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఇటీవలి కాలంలో పర్యావరణం, కాలుష్యం పేరిట దీపావళి నాడు టపాసులు కాల్చొద్దన్న ఆదేశాలిచ్చాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా, జనం మాత్రం బాంబులు కాల్చకుండా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మన సంస్కృతిలో భాగమైన దీపావళి పండుగ పేరిట.. చైనా కుట్ర పన్నిందని, టపాసుల్లో ప్రమాదకర రసాయనాలు కలుపుతోందని ఆ వైరల్ పోస్ట్ సారాంశం.
ఈ ప్రకటన విడుదల చేసిన వారు కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖలో సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బిస్వజిత్ ముఖర్జీ అని ఆ వైరల్ మెస్సేజ్‌లో పేర్కొంటున్నారు. భారత్‌పై దాడిచేసేందుకు పాకిస్తాన్.. చైనా సాయాన్ని కోరిందని, అందుకే చైనా.. ఇలా దీపావళి టపాసుల్లో ప్రమాదకర రసాయనాలు కలుపుతోందని వివరిస్తున్నారు. ఆందుకే చైనా క్రాకర్లు కొనవద్దని పేర్కొంటున్నారు. ఈ సందేశం.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ప్రధానంగా కొద్దిరోజులుగా వాట్సప్‌లో తెగ తిరుగుతోంది.
Fact Check - ఏది నిజం ?
అసలు ఈ పోస్ట్ నిజమేనా? అని Factful శోధించింది. ముందుగా ఈ ప్రచారం ఎవరు మొదలు పెట్టారు? ఎప్పటినుంచి జరుగుతోంది? అసలు నిజమేనా? అని పరిశోధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్నెట్‌లో వెతికితే.. ఈ ప్రచారం ఇప్పటిది కాదని మూడేళ్లుగా అంటే 2018 నుంచి ఈ పోస్ట్ వైరల్ అవుతోందని తేలింది.
అధికారిక నిర్ధారణ :
ఇక, అధికారిక నిర్ధారణ కోసం.. బిస్వజిత్ ముఖర్జీ అనే అధికారి హోంశాఖలో పనిచేస్తున్నారా లేదా? అని పరిశీలించడం జరిగింది. హోంమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పరిశీలించగా.. అందులో ఉన్న వివరాల మేరకు బిస్వజిత్ ముఖర్జీ అనే అధికారి పనిచేయడం లేదు. అంతేకాదు.. సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే పోస్టు కూడా లేదు. దీనిపై హోంమంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించగా అలాంటి ప్రకటన అధికారికంగా ఎవరూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పీఐబీ - ఫ్యాక్ట్‌చెక్ :
ఈ శోధనలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ఆధారాలు కూడా లభించాయి. గత యేడాది 2020లో, తిరిగి ఈ యేడాది కూడా సెప్టెంబర్ 29వ తేదీన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ట్విట్టర్ హ్యాండిల్ ఈ ప్రచారం అబద్ధమని నిర్ధారించింది. అంతేకాదు.. పలు ఫ్యాక్ట్‌చెకింగ్ సంస్థలు ఈ అంశంపై నిజ నిర్ధారణ చేశాయి.
-=================================
ప్రచారం : దీపావళి టపాసుల్లో చైనా ప్రమాదకర రసాయనాలు కలుపుతోంది. చైనా టపాసులు అస్సలు కొనవద్దని హోంమంత్రిత్వశాఖ ప్రకటన జారీచేసింది.
వాస్తవం : ఇది అబద్ధం. హోంమంత్రిత్వశాఖ ఇలాంటి ప్రకటన చేయలేదు.
కంక్లూజన్ : వైరల్ అవుతున్న పోస్టులో పేర్కొన్న అధికారి అసలు హోంమంత్రిత్వ శాఖలో లేడు. ఆయన డిసిగ్నేషన్ కూడా ఆ శాఖలో లేదు. కానీ, మూడేళ్లుగా ఈ ఫేక్‌న్యూస్ వైరల్ అవుతోంది.
-=================================
The finest bookmakers additionally offer stay betting, the place you can to|you possibly can} wager on video games as they happen. Our last benchmark during the analysis was cell compatibility. All the casinos listed above are mobile-friendly, offering customers an amazing gambling experience on the go. 바카라 BetOnline offers an entirely completely different web site on cellphones and tablets. Although there isn’t a devoted app, you’ll have entry to all the features you need whereas betting on the go.
ReplyDelete