Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factcheck - ఏది నిజం? : దివాళీ ఆఫర్‌ మళ్లీ వచ్చింది - ఫ్రీ డేటా ఆఫర్‌ తెచ్చింది.. ఒక్కసారి క్లిక్‌చేసి చూడండి

తెలుగు లోగిళ్లలో పండుగ శోభ కనిపిస్తోంది. ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ. ఎల్లుండి దసరా పర్వదినం జరుపుకుంటున్నాం. త్వరలోనే దీపావళి కాంతులతో తెలుగు...




తెలుగు లోగిళ్లలో పండుగ శోభ కనిపిస్తోంది. ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ. ఎల్లుండి దసరా పర్వదినం జరుపుకుంటున్నాం. త్వరలోనే దీపావళి కాంతులతో తెలుగు లోగిళ్లు నిండిపోతాయి. అయితే, ప్రతియేడూ మాదిరిగానే ఈ సారి కూడా దీవాళీ ఆఫర్‌ వచ్చి వాలింది. ఒకటి కాదు.. రెండు కాదు. 50 GB డేటా ఫ్రీగా ఇస్తామంటోంది.

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా.. వాట్సప్‌లో ఈ మెస్సేజ్‌ హల్‌చల్‌ చేస్తోంది. మెస్సేజ్‌ను చూసినవాళ్లు వెనుకా ముందూ ఆలోచించకుండా ఈ మెస్సేజ్‌ను షేర్‌ చేస్తున్నారు.

ఏది నిజం?

వాట్సప్‌లో వస్తున్న మెస్సేజ్‌లో పలు లింకులు ఇస్తున్నారు. ఒకటేమో మెయిన్‌ లింక్‌ అది.. https://xexeix.xyz/

దాని కింద మరిన్ని లింకులు ఇస్తున్నారు. మొత్తం ఎనిమిది లింకులు ఇచ్చారు. ఆ లింకులకు ఎయిర్‌టెల్‌, జియో, విఐ, టెలినార్‌, జాజ్‌, జాంగ్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, అదర్‌ నెట్‌వర్క్స్‌ అంటూ లింకులిచ్చారు. ఒక్కో లింక్‌కు ఒక్కో నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని వాళ్ల ఉద్దేశ్యం అన్నమాట.
 



ఆ లింకులను ఓపెన్‌ చేసే ప్రయత్నం చేసింది ఫ్యాక్ట్‌ఫుల్‌. దాని మెయిన్‌ లింక్‌ హోమ్‌పేజీలో రెండు పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ను జోడించింది. వాటిపై క్లిక్‌ చేసి లేదా, మెస్సేజ్‌లో ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌చేస్తే సంబంధిత లింక్‌లు ఓపెన్‌ అవుతాయి. ఆ తర్వాత స్టెప్‌లో ఈ మెస్సేజ్‌ను పలు వాట్సప్‌ గ్రూపులకు, కొంతమంది ఫ్రెండ్స్‌కు షేర్‌ చేయమని అడుగుతోంది. అలా గుడ్డిగా షేర్‌ చేసిన వాళ్లకు మళ్లీ హోమ్‌పేజీ ఓపెన్‌ అయి.. మళ్లీ అవే స్టెప్స్‌ ఫాలో కావాలంటోంది. అంటే.. ఇది ఫేక్‌ లింక్‌...
 


జనాన్ని ఆకర్షించేందకు కొందరు కామెంట్లు కూడా పెట్టారు. 

 



గతంలోనే ఫ్యాక్ట్‌ఫుల్‌ ఇలాంటి లింకులను పరిశీలించి ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. ఇప్పుడు మరోసారి 2021 పేరుతో వచ్చిన ఈ ఆఫర్‌ను పరిశీలిస్తే.. కొన్ని అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. 


1. ఏదైనా సంస్థ ఆఫర్‌ ఇస్తే ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అందివ్వాలి. కానీ, మనకు వస్తున్న లింక్‌లో అన్ని సంస్థలకూ ఒకే వెబ్‌ లింక్‌ ఇస్తున్నారు. https://xexeix.xyz/ ఇందులోనే అసలు మోసం తెలిసిపోతోంది.


2. పండుగలకు ఆఫర్లు ఇస్తున్నారంటే ఆసంస్థ మీడియాలో ప్రచారం చేస్తుంది. అలాంటి ప్రచారం ఏదీ ఎక్కడా కనిపించ లేదు.


3. ఏ సంస్థ అయినా డిస్కౌంట్‌ లేదా అదనపు డేటా ఇవ్వడానికి మొగ్గుచూపుతుంది కానీ, పూర్తిగా ఉచితంగా డేటా ఇచ్చేందుకు అరుదైన సందర్భాల్లో తప్ప ఎవరూ ముందుకు రారు. పైగా 50 జీబీ డేటా ఉచితం అంటే మాటలు కాదు.


=======================================
ప్రచారం : దివాళి సందర్భంగా 50 GB డేటా ఉచితంగా పొందవచ్చు. దానికి లింకులను క్లిక్‌ చేయాలి.

వాస్తవం : ఇది ఫేక్‌ న్యూస్‌. తప్పుడు లింక్‌లతో జనాన్ని మోసం చేస్తున్నారు.

కంక్లూజన్‌ : ఇలాంటి లింకులు ప్రతియేటా పండుగల వేళల్లో క్రియేట్‌ అవుతున్నాయి. ప్రతిసారీ జనం అత్యాశతో, సైబర్‌ నేరగాళ్ల బుట్టలో పడిపోతున్నారు.
========================================

No comments