Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factcheck - ఏది నిజం? : రాం గోపాల్‌ వర్మ కొత్త సినిమా 'వెన్నుపోటు ఈటల' - ఆర్జీవీ ట్వీట్‌ వెనుక కహానీ ఏంటి?

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్రసాము నేర్చుకోవాలంటూ రాంగోపాల్...
సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్రసాము నేర్చుకోవాలంటూ రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో తెగ చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో ఇటు.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా సంచలన ట్వీట్ ఆర్జీవీ చేశారంటూ వైరల్‌ అవుతోంది. రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ హ్యాండిల్‌పైనే ఆ ట్వీట్‌ పోస్ట్‌ చేసినట్లు వైరల్‌ అవుతున్న ఇమేజ్‌ చూస్తే స్పష్టమవుతోంది.  

ఆ పోస్ట్‌లో ఏముందో చూద్దాం :

''నాకెందుకో ఈటల రాజేందర్‌ కెసిఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్‌... చంద్రబాబు ఎన్టీఆర్‌ వెన్నుపోటు సేమ్‌ అనిపించింది. అందుకే ఈ ఈటల రాజేందర్‌ కెసిఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన విధానంపై తెలంగాణ రాజకీయ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా పేరు ''వెన్నుపోటు ఈటలు''.''
పైన పేర్కొన్న టెక్ట్స్‌ ఇమేజ్‌ను ఆర్‌జీవీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై పోస్ట్‌ చేసినట్లు రూపొందించారు. అసలే సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ.. ఉదయం ఏపీ రాజకీయాలపై సంచలన పోస్ట్‌ చేసినట్లే.. సాయంత్రానికి తెలంగాణ రాజకీయాల గురించి కూడా ఈ పోస్ట్‌ చేసి ఉంటారని అంతటా టాక్‌ నడిచింది. అంతేకాదు.. ఇటీవలే ఉత్తర తెలంగాణలో పేరున్న రాజకీయ నాయకులైన కొండా సురేఖ-మురళి జీవిత కథ ఆధారంగా 'కొండా' సినిమా తీస్తున్నారు రాంగోపాల్ వర్మ. స్వయంగా పలుసార్లు వరంగల్‌ వెళ్లిన ఆర్జీవీ.. సినిమా వివరాలను కూడా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈటల సినిమా కూడా నిజమే అన్న చర్చ తెలంగాణలో, మరీ ముఖ్యంగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతోంది. ఎందుకంటే హుజురాబాద్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రాజకీయ రణరంగం నడుస్తోంది. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలకోసం ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నిత్యం సభలు, సమావేశాలు, పార్టీలు నిర్వహిస్తున్నాయి. గ్రామ గ్రామాన ఓటర్లందరినీ జల్లెడ పడుతున్నాయి. ఈ సమయంలోనే ఆర్జీవీ పేరిట వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌ సంచలనంగా మారింది.  
 
Factful Fact check - ఏది నిజం?

ఈ పోస్ట్‌ వివాదాస్పదంగా ఉంది. పైగా.. పోలిక ఏమాత్రం కుదరలేదు. ఆనాటి ఎన్టీయార్‌ - చంద్రబాబు ఎపిసోడ్‌కు, ఈనాటి కేసీఆర్ - ఈటల ఎపిసోడ్‌కు ఎక్కడా పొంతన లేదు. రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు ఇది అవగతం అవుతుంది. ఆర్జీవీ సంచలన దర్శకుడే అయినా.. సబ్జెక్ట్‌ ఉన్న దర్శకుడు. ఒకవేళ ఈటల సినిమా భవిష్యత్తులో తీయాలనుకున్నా ఎన్టీయార్‌ ఎపిసోడ్‌తో ముడిపెట్టడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందుకే.. ప్రాథమికంగా ఈ పోస్ట్‌ ఆర్జీవీ చేసింది కాదన్న స్పష్టత వస్తోంది.

అంతేకాదు.. ఈపోస్ట్‌పై Factful సాగించిన పరిశోధనలో భాగంగా రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ హ్యాండిల్‌ను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో ఆర్జీవీ ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈ పోస్ట్‌ కనిపించింది. అయితే, ఇది తన పేరిట సర్క్యులేట్‌ అవుతున్న  ఫేక్‌ న్యూస్‌ ''This is a fake thing in circulation'' అని పోస్ట్‌ చేశారు. 
స్వయంగా రాంగోపాల్‌ వర్మే ఈ పోస్ట్‌ చేసినందున వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌ అబద్ధం అని నిర్ధారణ అయ్యింది.

=============================
ప్రచారం :  
త్వరలో ''వెన్నుపోటు ఈటలు'' సినిమా తీయనున్న రాంగోపాల్‌ వర్మ

వాస్తవం :
రాంగోపాల్‌ వర్మ చేసిన పోస్ట్‌ కాదు ఇది. ఆర్జీవీ యే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. కాబట్టి ఇది అబద్ధం.

కంక్లూజన్ :
హుజురాబాద్‌లో నిత్యం ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నందున టీఆర్‌ఎస్‌, బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌లు చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఇలాంటి తప్పుడు న్యూస్‌లు క్రియేట్‌ చేస్తూ.. జనాన్ని కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారు.
================================


No comments