ఫ్లిప్‌కార్ట్ ఒక ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ. దీని గురించి నెట్ వినియోగదారులు, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందరికీ తెలుసు. అయిత...
ఫ్లిప్‌కార్ట్ ఒక ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ. దీని గురించి నెట్ వినియోగదారులు, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందరికీ తెలుసు. అయితే, ఈ ఫ్లిప్‌కార్ట్ సంస్థ పేరుతో ఓ లింక్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ లింక్‌తో పేర్కొన్న సమాచారం చూసినవాళ్లంతా ఆశతో వైరల్ చేస్తున్నారు. ఫలితంగా వాట్సప్‌లో ఈ మెస్సేజ్‌లు నిండిపోతున్నాయి.
వైరల్ అవుతున్నది ఏంటి ?
ఫ్లిప్‌కార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని, అందులో పాల్గొన్న వాళ్లకు ఎంఐ 11ఎక్స్ మొబైల్ ఉచితంగా ఇస్తామని పేర్కొంటున్నారు. అయితే, కింది లింక్ క్లిక్ చేసి ఈ పోటీలో పాల్గొనవచ్చునని పేర్కొంటున్నారు.
వాస్తవానికి Mi 11X మొబైల్ ఫోన్ విలువ 40వేల రూపాయల దాకా ఉంది. ఇది 5G మొబైల్. అందుకే ఈ లింక్, లింక్‌తో ఉన్న సమాచారం చూడగానే వేరే ఆలోచన లేకుండా జనం ఈ లింక్‌ను వైరల్ చేసేందుకు ఎగబడుతున్నారు. ఎందుకంటే ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చిన తర్వాత.. వాట్సప్ కాంటాక్ట్స్‌కు, వాట్సప్ గ్రూపులకు షేర్ చేయాలని అడుగుతోంది. దీంతో, 40వేల రూపాయల మొబైల్ ఫోన్ కోసం ఈ మాత్రం చేయలేమా? అనుకుంటున్న నెటిజన్లు, స్మార్ట్‌ఫోన్ యూజర్లు దీనిని తమకు తెలిసిన వాళ్లందరికీ ఫార్వార్డ్ చేస్తున్నారు. చివరలో అది అంతా అబద్ధమని గుర్తిస్తున్నారు. నాలిక్కరుచుకుంటున్నారు. కానీ, అప్పటికే అందరికీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారు.
ఇలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని, అబద్ధమని ఫ్యాక్ట్‌ఫుల్ మొదటినుంచీ చెబుతోంది. కానీ, స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యాశకు పోయి.. ఈ లింకులను ఓపెన్ చేస్తున్నారు. ఇవి చాలా భయంకరమైన లింకులు. వీటి ద్వారా మన సర్వ సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని ఫ్యాక్ట్‌ఫుల్ సూచిస్తోంది.
=======================
ప్రచారం : ఫ్లిప్‌కార్ట్ తన 20వ వార్షికోత్సవం సందర్భంగా Mi 11X మొబైల్ ఉచితంగా అందిస్తోంది.
వాస్తవం : ఇది అబద్ధపు లింక్. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఎలాంటి బహుమతి ఇవ్వడం లేదు.
కంక్లూజన్ : ఇలాంటి లింకుల వల్ల మన సెల్‌ఫోన్, కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తారు. ఫలితంగా మన సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. కాబట్టి ఇకముందైనా ఎవరూ ఇలాంటి లింకులు ఓపెన్ చేయకండి.
=======================
No comments