Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful - Fact check - ఏది నిజం? : నరేంద్రమోదీ ఫ్రీ రీచార్జ్‌ ఆఫర్‌ ఇస్తున్నారా ? వైరల్‌ మెస్సేజ్‌లో వాస్తవమెంత?

    వాట్సప్‌లో ఇంకో మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంది. అది చూసిన వాళ్లందరినీ ఆకర్షిస్తోంది. అందులో ఉన్న లింకును తప్పనిసరిగా ఫాలో అయ్యేలా చేస్తోంది. ...


 

 

వాట్సప్‌లో ఇంకో మెస్సేజ్‌ వైరల్‌ అవుతోంది. అది చూసిన వాళ్లందరినీ ఆకర్షిస్తోంది. అందులో ఉన్న లింకును తప్పనిసరిగా ఫాలో అయ్యేలా చేస్తోంది. తర్వాత వాళ్లను నాలుక్కరుచుకునేలా చేస్తోంది. ఎదుటివాళ్లను ఊరికే తప్పుదారి పట్టించామంటూ పశ్చాత్తాపపడేందుకు కారణమవుతోంది. 

ఆ మెస్సేజ్‌ ఏంటో చూద్దాం...


''మీ మొబైల్‌ను రీచార్జ్‌ చేయవద్దు. నరేంద్రమోడీ టాక్‌టైమ్‌గా రూ.400/- ఇస్తున్నారు. తన ప్రాజెక్ట్‌ (స్మార్ట్‌ సిటీ)కోసం గొప్ప విజయం కోసం.. ఈ సందేశాన్ని కేవలం 3 గ్రూపులకు, మాత్రమే పంపండి. మరియు 5 నిమిషాల తర్వాత మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయండి....''


vodafone - *111*6*2#
ఎయిర్టెల్‌ - *121*2#
ఆలోచన  - *123*10#
ఎయిర్‌సెల్‌   - *165*6*1#
డోకొమో  - *111*1*1#
Bsnl  - *112#
జియో  - 1991.

నేను కూడా షాక్‌ అయ్యాను..
కానీ ఇది నిజం#

పైన పేర్కొన్న మెస్సేజ్‌ వాట్సప్‌లో ఎక్కువగా వైరల్‌ అవుతోంది.
అది చూడగానే 400 రూపాయల రీచార్జ్‌ వస్తుందనుకొని చాలామంది దీనిని ఫార్వార్డ్ చేస్తున్నారు. మరి.. ఫార్వార్డ్‌ చేస్తే నిజంగానే డబ్బులొస్తాయా? ఎలా వస్తాయి? అన్న విషయం ఆలోచించడం లేదు.

Fact check - ఏది నిజం? 


పై మెస్సేజ్‌ పూర్తిగా అబద్ధం. కేవలం ఒక మెస్సేజ్‌ను మూడు వాట్సప్‌ గ్రూపులకు ఫార్వార్డ్‌ చేసినంత మాత్రాన మన మొబైల్‌లోకి ఆటోమెటిక్‌గా రీచార్జ్‌ కావడం అసాధ్యం. పైగా.. అధికారిక లింకులు గానీ, నమ్మదగిన సమాచారం గానీ ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు.

=============================
ప్రచారం :  
వైరల్‌ మెస్సేజ్‌ను మూడు వాట్సప్‌ గ్రూపులకు షేర్‌ చేస్తే.. 400 రూపాయల టాక్‌టైమ్‌ వస్తుంది.

వాస్తవం :
వైరల్‌ అవుతున్న మెస్సేజ్‌లో ఓ లింకు గానీ, నమ్మదగిన సమాచారం గానీ లేదు. కాబట్టి ఇది అవాస్తవం.

కంక్లూజన్ :
కేవలం మెస్సేజ్‌ ఫార్వార్డ్ చేసినంత మాత్రాన సర్వీస్‌ ప్రొవైడర్లకు సమాచారం తెలిసే అవకాశం లేదు. అంతేకాదు.. ఉచితంగా రూ.400 టాక్‌టైమ్‌ ఇచ్చే ప్రతిపాదన ఎవరూ చేయలేదు.
================================

No comments