Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful - Factcheck - ఏది నిజం? : రాం గోపాల్‌ వర్మ world leaders and their dogs ఫోటో నిజమేనా? ఆర్జీవీ నిజంగానే ట్వీట్‌ చేశారా?

వాట్సప్‌, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. world leaders and their dogs అనే క్యాప్షన్‌తో వివాదాస్పద దర్శకుడు రాంగ...




వాట్సప్‌, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. world leaders and their dogs అనే క్యాప్షన్‌తో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై దీన్ని పోస్ట్‌ చేశాడంటూ వైరల్‌ అవుతోంది.

ఆ ఫోటోను పరిశీలిద్దాం...

 



సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో దాన్ని పోస్ట్ చేసినట్లుగా ఇమేజ్‌ రూపొందించారు. అందులో పలువురు దేశాధినేతలు తమ పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటోలను ఉంచారు. నాలుగో ఫోటోలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటున్న ఫోటోను చేర్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సాధారణంగా రాంగోపాల్‌ వర్మ ఏం చేసినా వివాదం ఉంటుంది. సంచలనం అవుతుంది. ఆయన చేసే పోస్టులు, ఆయన మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. అందుకే చాలామంది రాంగోపాల్‌ వర్మే ఈ ట్వీట్‌ చేసి ఉంటారని అనుకుంటున్నారు. సెన్సేషనల్‌ కోసం ఈ ఫోటో తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసి ఉండొచ్చనుకుంటున్నారు.

Factful Fact check - ఏది నిజం?

ఈ ఫోటో వివాదాస్పదంగా ఉంది. దీనిని రాంగోపాల్‌ వర్మ ట్వీట్ చేసి ఉంటాడా? అని Factful శోధిస్తే రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఈ ఫోటో ఎక్కడా కనిపించలేదు. కాబట్టి రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో స్వయంగా పోస్ట్‌ చేసిన ఇమేజ్‌ కాదు ఇది. ఎవరో రాజకీయ విరోధులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను డీఫేమ్‌ చేసేందుకు ఇలా ఓ ఫోటోను రూపొందించినట్లు అర్థమవుతోంది.  కాబట్టి ఇది అబద్ధం...

ఇదొక్కటే కాదు.. ఇంకొన్ని కూడా ఉన్నాయి.. చూడండి :

అంతేకాదు.. ఈ ఫోటో రాంగోపాల్‌ వర్మ పోస్ట్‌ చేసి ఉంటాడా ? అన్న కోణంలో Factful పరిశోధిస్తున్న క్రమంలో ఇలాంటివే ఇంకొన్ని ఫోటోలు పలు సందర్భాల్లో రూపొందించినట్లు కనిపించాయి. అలాంటి ఫోటోలు కొన్ని చూద్దాం...

 







ఇవన్నీ తమ ప్రత్యర్థులను కించపరిచేందుకు ఇలాంటి ఫోటోలను రూపొందించినట్లు అర్థమవుతోంది. మొదటి మూడు ఫోటోలను తమ పెంపుడు కుక్కలతో పలువురు ప్రముఖులను చేర్చిన వాళ్లు.. నాలుగో ఫోటోను మాత్రం తాము టార్గెట్‌ చేసిన వాళ్లను కించపరిచేందుకు ఉపయోగించుకున్నట్లు తేటతెల్లమవుతోంది.

ఇప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఫోటో కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎవరో కావాలని ఈ ఫోటోను ఫోటోషాప్‌లో తయారుచేసి రాంగోపాల్‌ వర్మ పోస్ట్‌ చేసినట్లు క్రియేట్‌ చేశారు.


=============================
ప్రచారం :  
చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క పవన్‌ కల్యాణ్‌ అనే అర్థం వచ్చేలా ఇమేజ్‌ వైరల్‌. దానికి world leaders and their dogs అనే క్యాప్షన్‌.

వాస్తవం :
రాంగోపాల్‌ వర్మ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈ పోస్ట్ చేయలేదు. ఆయన వేరే సోషల్ మీడియాల్లో కూడా ఈ పోస్ట్‌ కనిపించలేదు. కాబట్టి ఇది అబద్ధం.

కంక్లూజన్ :
తమ కుక్కలతో ప్రపంచంలోని ప్రముఖులు అనే పేరిట కొంతకాలంగా ఓ క్యాంపెయిన్‌ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. తమకు గిట్టని వాళ్లపై ప్రయోగించేందుకు ఈ ఇమేజ్‌ ఫ్రేమ్‌ను ఎవరికి వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌ చేసి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
================================

No comments