Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful Alert - ఏది నిజం? : మీకు ఎస్‌బీఐ నుంచి ఈ మెస్సేజ్‌ వచ్చిందా? తొందరపడి వివరాలు చెప్పకండి.. ఈ స్టోరీలో వివరాలు చూడండి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని అతి పెద్ద బ్యాంక్‌. అత్యధిక సంఖ్యలో ఖాతాదారులున్న బ్యాంక్‌ అది. అయితే, అప్పుడప్పుడూ కొందరు దుర్బుద్ధిత...




స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని అతి పెద్ద బ్యాంక్‌. అత్యధిక సంఖ్యలో ఖాతాదారులున్న బ్యాంక్‌ అది. అయితే, అప్పుడప్పుడూ కొందరు దుర్బుద్ధితో కస్టమర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎస్‌బీఐ పేరుతో తప్పుడు మెస్సేజ్‌లు, స్పామ్‌ మెస్సేజ్‌ల బాధితులు ఎక్కువగానే ఉంటారు. ఆ తరహాలోనే ఇప్పుడు మరికొన్ని  మెస్సేజ్‌లు ఎస్‌బీఐ కస్టమర్లను పలకరిస్తున్నాయి.

ఆ మెస్సేజ్‌లు ఒకసారి పరిశీలిద్దాం...

 

 



ఒక మెస్సేజ్‌ చూస్తే.. ఈ ఎస్‌బీఐ ఎకౌంట్‌ హోల్డ్‌లో పెట్టామని, ఈ మెస్సేజ్‌లో ఇచ్చిన లింక్‌ ఓపెన్‌ చేసి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరో మెస్సేజ్‌ చూస్తే... ఏకంగా  మీ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందని, మీ పాన్‌కార్డ్‌ డీటెయిల్స్‌ అప్‌డేట్‌ చేస్తే సర్వీసులు పునరుద్ధరిస్తామని పేర్కొంటున్నారు.

ఈ రెండు మెస్సేజ్‌లలో ఒక మెస్సేజ్‌కేమో.. sbi-kyc.in అనే లింక్‌ ఇవ్వగా.. మరొకదానికి updatepan.in అనే లింక్‌ను ఇస్తున్నారు.

Factful - Factcheck - ఏదినిజం?

ఈ రెండు ఎస్‌ఎంఎస్‌లను గమనిస్తే.. ఎస్‌బీఐ ఒరిజినల్‌ వెబ్‌సైట్‌ లింక్‌కు సంబంధం లేని లింకులు ఇచ్చారు. నిజంగానే ఎస్‌బీఐ అకౌంట్‌ అప్‌డేట్ కు సంబంధించిన వివరాలు తెలియజేయాలంటే వాస్తవమైన ఎస్‌బీఐ రెగ్యులర్‌ లింక్‌ ఇచ్చి.. అందులో అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పాలి. లేదంటే సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి అవసరమైన వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించాలి. ఎదుకంటే దేశంలో అత్యధిక బ్రాంచీలు కలిగిన బ్యాంక్‌ ఎస్‌బీఐ. దాదాపు ప్రతి ఊళ్లో, నగరాల్లో అయితే ప్రతి ఏరియాలో ఎస్‌బీఐ ఉంటుంది. కానీ, ఆ లింక్‌లో అనుమానాస్పద లింకులు ఇచ్చారు. ఎస్‌బీఐ కేవైసీ అనే వెబ్‌సైట్‌ ఉండదు. అలాగే, అప్‌డేట్‌ పాన్‌ అనే లింక్‌ కూడా నమ్మదగింది కాదు.  కాబట్టి ఇది అబద్ధం.

=============================
ప్రచారం :  
ఎస్‌బీఐ బ్యాంకు వినియోగదారులకు మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. కొన్నింట్లో అకౌంట్ హోల్డ్‌లో పెట్టామని, మరికొన్ని ఎస్‌ఎంఎస్‌లలో అకౌంట్ బ్లాక్‌ చేశామని పేర్కొంటున్నారు.

వాస్తవం :
ఇలా ఎస్‌బీఐ పేరుతో వస్తున్న ఎస్‌ఎంఎస్‌లు అబద్ధం. ఇవి అధికారిక లింకులు కాదు. స్పామ్‌ లింకులు.

కంక్లూజన్ :
ఎస్‌బీఐ వినియోగదారుల్లో చాలామంది నిరక్షరాస్యులు, అవగాహన లేనివాళ్లున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎస్‌బీఐ బ్రాంచీలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక బ్రాంచీలు కలిగిన బ్యాంకు కావడంతో.. సైబర్‌ నేరగాళ్లు వీళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఆ లింకులు ప్రమాదకర వైరస్‌లను కలిగి ఉంటాయి. కాబట్టి మెస్సేజ్‌ ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దు.
================================

No comments