Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : పనిచేయని సోషల్‌ మీడియా - స్తంభించిన ప్రపంచం

భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 2...




భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఒక్క నిద్ర పోయినప్పుడు మినహా.. ప్రతిక్షణం సోషల్ మీడియాతోనే సహజీవనం చేస్తున్నారు జనం. ప్రధానంగా సోషల్‌ మీడియా అంటే.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌. అయితే, ఈ మూడు సర్వీసులూ ఉన్నట్టుండి నిలిచిపోయాయి. దీంతో, జనం పిచ్చెక్కి పోతున్నారు.

సోమవారం రాత్రి సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు వాట్సప్‌ సేవలు నిలిచిపోయాయి. వాట్సప్‌తో పాటు.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లదీ అదే పరిస్థితి. చాలా మంది తొలుత తమ స్మార్ట్‌ఫోన్‌, డివైజ్‌లో ఇంటర్నెట్‌ ప్రాబ్లమ్‌ లేదంటే వైఫై ప్రాబ్లమ్‌ అనుకున్నారు.కానీ, నిమిషాలు గడిచిన కొద్దీ టెన్షన్‌ పెరిగిపోయింది. సేవలు పునరుద్ధరణ కాలేదు. దీంతో, జనం సాంప్రదాయ మెస్సేజ్‌ మాధ్యమాన్ని వినియోగించుకున్నారు. ఫోన్‌కాల్స్‌తో సమాచారం చేరవేసుకుంటున్నారు. ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. మీడియా ఛానెళ్లు, వెబ్‌సైట్లు చూసి అసలు కారణం ఏంటో తెలుసుకుంటున్నారు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితినెలకొంది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్న యూజర్లు వాటి సేవలను యాక్సెస్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వివరాలు పంచుకుంటున్నారు.

వాస్తవానికి ఈ మూడు ప్లాట్‌ఫామ్స్‌ ఫేస్‌బుక్‌ యాజమాన్యం పరిధిలో ఉన్నాయి. ఇవి అర్థరాత్రి దాటినా పనిచేయక పోవడంతో జనం పిచ్చోళ్లవుతున్నారు.  అయితే, ఈ  సమస్యపై స్పందించిన ఫేస్‌బుక్‌ "క్షమించండి, ఏదో తప్పు జరిగింది. మేము దానిపై పనిచేస్తున్నాము. మేము సాధ్యమైనంత త్వరగా దానిని పరిష్కరించగలము" అని ఫేస్‌బుక్‌ వెబ్ సైట్ లో ఒక ప్రకటన చేసింది.

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు రాత్రి 9 గంటల సమయంలో వినియోగదారులు ట్విట్టర్లో సందేశాలను పోస్ట్ చేశారు. వెబ్ సేవలను ట్రాక్ చేసే వెబ్ సైట్ downdetector.com ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సేవలలో సమస్యలను ఎదుర్కొన్నట్లు 20,000కు పైగా మంది ఈ సమస్య గురుంచి రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

No comments