ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన రాజకీయ పార్టీల గురించి బీబీసీ సర్వే చేసిందా? ఆజాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీ పేరు ఉందా? ఏప...
ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన రాజకీయ పార్టీల గురించి బీబీసీ సర్వే చేసిందా? ఆజాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీ పేరు ఉందా? ఏపీలో ఈ ప్రచారాన్ని వైరల్ చేసిన వాళ్లెవరు ? సర్వేకు సంబంధించి బీబీసీ ఇచ్చిన సమాధానమేంటి?
కొన్ని రాజకీయ పార్టీలు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. నైతికతను గాలికి వదిలేస్తున్నాయి. ఆరోగ్యకర పోటీ వాతావరణానికి కొన్ని పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ఎదుటి పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. భయంకరమైన అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నాయి. అదే క్రమంలో, పలువురు నాయకులు సోషల్ మీడియాలో ఎదుటి పార్టీలను కించపరిచే పోస్టులను చేస్తున్నారు.
ఇది.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇమేజ్. ట్విట్టర్, ఫేస్‌బుక్ వాల్స్‌పై ఓ రేంజ్‌లో దూసుకెళ్లిన పోస్ట్. ఇందులో ప్రపంచంలోని అత్యంత అవినీతికరమైన పార్టీల జాబితా అంటూ ఓ ఇమేజ్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత అవినీతికర పార్టీల జాబితాలో భారత్‌లోని తెలుగుదేశం పార్టీ నాలుగోస్థానంలో ఉందన్నది ఆ పోస్ట్‌లో ప్రస్తావించిన ప్రధాన అంశం. అంతేకాదు.. ఆ జాబితాలో తెలుగుదేశం పార్టీ పేరును హైలైట్ చేశారు.
అసలు ఈ సర్వే ప్రతిష్టాత్మకమైన బీబీసీ న్యూస్ చేపట్టిందని ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. కానీ, ఇదే హెడ్‌లైన్‌తో చాలా మంది ఈ జాబితాను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఒక్కో సోషల్ మీడియా యూజర్ ఒక్కో జాబితాను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ చేశారు. వాటిలో కొందరు బీజేపీని అత్యంత అవినీతికర రాజకీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో చేర్చారు. మరికొందరు బీజేపీని ఆ జాబితాలో నాలుగోస్థానంలో చేర్చారు. ఇంకొందరేమో బీజేపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీని చేర్చారు. వాటికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో చూడొచ్చు.
అంటే.. కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునేందుకు, ఎదుటి పార్టీలపై బురద చల్లేందుకు ఈ జాబితాను ఎలా పడితే అలా ఉపయోగించుకున్నారన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎవరికి వాళ్లు వాళ్లకు అనుకూలంగా ఈ లిస్ట్‌ను మార్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో దీనిని వైరల్ చేస్తున్నారు. ఒక్క ట్విట్టరే కాదు.. ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి బీబీసీ న్యూస్ ఇప్పటివరకు అసలు ఇలాంటి సర్వే చేయనే లేదు. మొట్టమొదటగా 2017లో బీబీసీ న్యూస్ సర్వే పేరిట ఈ వైరల్ ఇమేజ్ సోషల్ మీడియాలో కనిపించింది. అయితే, అప్పుడే బీబీసీ ప్రతినిధి గీతాపాండే వివరణ ఇచ్చారు. ఇలాంటి ఫేక్‌న్యూస్‌లు వైరల్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, బీబీసీ సంస్థ అలాంటి సర్వే చేయలేదని.. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
===============================
ప్రచారం : ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయ రాజకీయ పార్టీల గురించి బీబీసీ సర్వే చేసింది.
వాస్తవం : బీబీసీ ఇలాంటి సర్వే చేయలేదు.
కంక్లూజన్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎదుటిపార్టీల ప్రాభవాన్ని దెబ్బతీసేందుకు బీబీసీ పేరిట ఈ ఇమేజ్‌ను వైరల్ చేస్తున్నాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జాబితాలో పేర్లు యాడ్ చేస్తున్నారు.
=================================
No comments