Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful Alert - జర జాగ్రత్త : ఆర్‌బీఎల్‌ బ్యాంకులో అకౌంట్‌ ఉందా? క్రెడిట్‌ కార్డు ఉందా ? అయితే, అలర్ట్‌గా ఉండండి

  'ద రత్నాచల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌'. దీనినే సింపుల్‌గా ఆర్‌బిఎల్‌ బ్యాంక్ అని పిలుస్తారు. ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన ఆర్‌బీఎల్‌ బ్యాంకిం...

 

'ద రత్నాచల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌'. దీనినే సింపుల్‌గా ఆర్‌బిఎల్‌ బ్యాంక్ అని పిలుస్తారు. ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన ఆర్‌బీఎల్‌ బ్యాంకింగ్‌ సర్వీసులతో పాటు.. క్రెడిట్‌ కార్డు సర్వీసులు కూడా అందజేస్తుంది. ఇవి రెండేకాకుండా.. కార్డ్‌లెస్‌ ఆన్‌లైన్‌ క్రెడిట్‌కార్డ్ సర్వీసులు కూడా అందిస్తోంది ఆర్‌బీఎల్‌. ఉదాహరణకు ఆర్‌బీఎల్‌ మనీట్యాప్‌ కార్డ్ ఉన్నవాళ్లకు ఫిజికల్‌ కార్డుతో సంబంధం లేకుండా.. మనీట్యాప్‌ యాప్‌తోనే చాలా సులువుగా లోన్స్‌ తీసుకోవచ్చు. ప్రైవేట్‌ బ్యాంక్‌ కావడంతో ఎక్కువమందికి తన బ్యాంకు సదుపాయాలు అందించేందుకు, క్రెడిట్‌ కార్డులు అందించేందుకు ఆ సంస్థ ఉవ్విళ్లూరుతుంది. అలా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు లక్షల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు.

అయితే, ఇటీవలి కాలంగా బ్యాంకుల కస్టమర్లే టార్గెట్‌గా సైబర్‌ క్రైమ్‌లు భారీగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది ఫిషింగ్‌ కంత్రీగాళ్ల బారిన పడుతున్నారు. చాలామంది కస్టమర్లకు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పంపించిన మాదిరిగానే ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిళ్లు పంపిస్తున్నారు. ఆ లింకులు క్లిక్‌ చేసిన వాళ్ల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. దీంతో, చాలామంది బాధితులవుతున్నారు.

ఆర్‌బీఎల్‌ పేరిట వచ్చే మెస్సేజుల్లో ఏముంటోంది? :

''ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి ప్రత్యేక ఆఫర్‌గా మీరు ఒక కారును గెలుపొందారు. ఈ గొప్ప ఆఫర్‌ను పొందడానికి ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి.'' అని ఉంటోంది. ఇలాంటివే మరికొన్ని మెస్సేజ్‌లు కూడా పంపిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. 





ఈ క్రమంలోనే ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. తప్పుడు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లను నమ్మొద్దని, వాటిలో ఇచ్చే లింకులు క్లిక్‌ చేయొద్దని కోరింది. 'నకిలీ ఆఫర్లను తిరస్కరించాలంటూ అలర్ట్‌ చేసింది. ఈమేరకు ఆర్‌బీఎల్‌ కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు పంపిస్తోంది.

 



కస్టమర్లకు ఏదైనా అత్యవసరం అయితే, అనుమానాలు ఉంటే  కస్టమర్‌కేర్‌కు కాల్‌ చేయాలని సూచిస్తోంది. 

 

 



Factful Alert - ఫ్యాక్ట్‌ఫుల్‌ అలర్ట్‌ :

ప్రజలను తప్పుదోవ పట్టించే, తప్పుడు సమాచారం ఇచ్చే, మోసపూరిత మెస్సేజ్‌లు, సమాచారంపై ఫ్యాక్ట్‌ఫుల్‌ ఎప్పటికప్పుడు పాఠకులను అలర్ట్‌ చేస్తుంది.


కామెంట్‌ బాక్స్‌లో తెలియజేయండి :

ఎవరికైనా ఇలాంటి తప్పుడు సమాచారం వచ్చినా, అనుమానాలున్నా ఫ్యాక్ట్‌ఫుల్‌కు మెయిల్‌ చేయండి. అలాగే, కామెంట్‌ బాక్స్‌లో తెలియజేయండి. ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా ఫేక్‌న్యూస్‌ భరతం పడుతుంది.  


No comments