Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact check - ఏది నిజం ? : ఏపీలో బోషిడికె బ్రాందీ, బోషిడికె మెడిసిన్స్‌ అమ్ముతున్నారా? వైరల్‌ పోస్టుల అసలు వాస్తవమేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజులుగా బోషిడికె పదం తీవ్రంగా చర్చనీయాంశమయ్యింది. తెలుగుదేశం పార్టీ నాయకుడొకరు ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను బోషిడికె ...




ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజులుగా బోషిడికె పదం తీవ్రంగా చర్చనీయాంశమయ్యింది. తెలుగుదేశం పార్టీ నాయకుడొకరు ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను బోషిడికె అని తిట్టారన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా ముఖ్యమంత్రే బోషిడికె అంటే అదో బూతు పదం, బండ బూతు అంటూ ఓ అధికారిక కార్యక్రమంలోనే మాట్లాడారు. తర్వాత మరికొందరు ఈ పదానికి అసలు అర్థం ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో కూడా వివరణలు ఇచ్చారు. దీనికి సంబంధించి మీడియాలో కూడా బీప్‌ సౌండ్‌ లేకుండానే మాట్లాడింది మాట్లాడినట్లు ప్రసారం చేశారు. పాఠకులకు వీక్షకులకు గౌరవం, విలువలు, నైతికత అనే పాఠాలు చెప్పే ప్రధాన స్రవంతి మీడియా కూడా అలాగే ఈ వ్యాఖ్యానాలను ప్రసారం చేసింది. దీంతో, కొద్దిరోజుల పాటు ఈ బోషిడికె పదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక, నిరంతరాయంగా యాక్టివ్‌గా ఉండే సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు కూడా ఈ పరిణామంతో మేత దొరికింది. కొన్నాళ్లపాటు సెటైర్లు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు నడిచాయి. అంతేకాదు.. ఈ పదంతో ఎలా ఆడుకోవాలో అలా కూడా ఆడుకున్నారు. అయితే, ఇదే సమయంలో రెండు వైరల్‌ పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ ఓ రకంగా వినోదాన్ని పంచాయి. ఇలాంటి ప్రొడక్టులు కూడా ఉంటాయా అన్న ఆలోచనను రేకెత్తించాయి.

వైరల్ అవుతున్నదేంటి? :




ఇవే ఆ వైరల్‌ పోస్టులు. ఒకటేమో బోషిడికె (BOSHEDEK) మందు బాటిల్. మరొకటేమో బోషిడికె (BOSHEDIKE-30) మెడిసిన్స్‌. వీటి గురించి ఇంతకుముందు అసలు ఎవరూ చూడలేదు. లేదంటే పట్టించుకోలేదా? అన్న సందేహం కూడా అందరిలోనూ కలిగింది. నిజంగానే ఇలాంటి బ్రాండ్‌లు ఉండి ఉండవచ్చునని చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. మరికొందరు ఇలాంటి బ్రాండ్లను వెతికి పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు సాగించారు.

Factcheck - ఏది నిజం? :
తప్పుడు వార్తలను వెతికి పట్టుకొని, సోషల్ మీడియా యూజర్లలో చైతన్యం నింపేందుకు తెలుగులో కృషి చేస్తున్న Factful ఈ వైరల్‌ పోస్టుల వాస్తవాన్నీ వెలికి తీయాలని నిర్ణయించుకుంంది. ఈ ప్రచారానికి సంబంధించిన అసలు కోణాన్ని బయటపెట్టేందుకు పూనుకుంది. మార్కెట్లో వీటిని పోలిన ప్రొడక్టులు ఏమున్నాయో పరిశీలించింది. గూగుల్ సాయంతో అసలు ఉనికిని కనిపెట్టింది.

ఒకటేమో గెలాక్సీ - మరొకటేమో నిమోటైమ్‌ :
సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పై ప్రొడక్టుల అసలు స్వరూపాన్ని Factful కనుక్కుంది. కొందరు కావాలని పేరు మార్చి ప్రచారం చేస్తున్నారని కనిపెట్టింది. వాటిలో మందు బాటిల్‌ మీద ఉన్న పేరును మాత్రం ఫోటోషాప్‌లో ఎడిట్ చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెడిసిన్‌ బాక్స్‌ మీద పేరును మాత్రం కాస్త ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న వీడియో ఎడిటర్‌ మార్చినట్లు బోధపడుతోంది. 

 



వాట్సప్‌లో వైరల్‌ అవుతున్న బోషిడికె మందు బాటిల్‌ అసలు పేరు GALAXY. అలాగే, మెడిసిన్స్‌కు సంబంధించి బోషిడికె గా ప్రచారం అవుతున్న ప్రొడక్ట్‌ NIMOTIME-30. ఈ బ్రాండ్‌లకు సంబంధించిన పేర్లు మాత్రమే మార్చి బోషిడికె బ్రాండ్లుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారిన ఈ పదాన్ని సోషల్‌ మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మార్చేశారు.


===========================================
ప్రచారం : ఏపీలో బోషిడికె బ్రాండ్‌లతో మందు, మెడిసిన్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి.
వాస్తవం : అసలు బ్రాండ్‌ల పేర్లు మార్చి బోషిడికె అని మార్చేసి సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.
కంక్లూజన్‌ : బోషిడికె అనే పదం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్న సమయంలో సోషల్‌ మీడియా వేదికగా ఆ అంశాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నం చేశారు.
===========================================

No comments