Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful Alert - బ్యాంకులు పంపించే ఎస్‌ఎంఎస్‌లు, అలర్ట్‌లు నిజమేనా?

స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక, సోషల్ మీడియా విస్తృతం అయ్యాక, సైబర్‌ క్రైమ్‌లు పెరిగిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌లు, అలర...


స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక, సోషల్ మీడియా విస్తృతం అయ్యాక, సైబర్‌ క్రైమ్‌లు పెరిగిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌లు, అలర్ట్‌లు పంపిస్తున్నాయి. అన్ని బ్యాంకులు దాదాపు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో మెస్సేజ్‌లు పంపిస్తుంటే, మరికొన్ని బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌లు, ఈమెయిళ్లలో కూడా ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి.

ప్రధాన బ్యాంకులు ఈ మెస్సేజ్‌లను తరచూ పంపిస్తూ వినియోగదారులు మోసాల బారి పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. అయితే, పనిలో పనిగా దొంగ మెస్సేజ్‌లు కూడా బ్యాంకుల పేరుతో అప్పుడప్పుడూ వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని Factful హెచ్చరిస్తోంది.

ఏం చేయాలి ?

- ఈమెయిల్‌ అయినా, ఎస్ఎంఎస్‌ అయినా, వాట్సప్‌ మెస్సేజ్‌ అయినా అది ఎక్కడినుంచి వచ్చిందో జాగ్రత్తగా గమనించండి.
- సెండర్‌ నేమ్‌ బ్యాంకు పేరుతో ఉందా.. ఏదైనా నెంబర్ ఉందా గమనించండి.
- బ్యాంకు పేరుతో ఎస్‌ఎంఎస్‌, మెస్సేజ్‌ వస్తే 99శాతం అనుమానం అవసరం లేదు. అందులో ఉన్న సారాంశాన్ని ఫాలో కావొచ్చు.
- సెండర్‌ నేమ్‌ దగ్గర ఏదైనా నెంబర్‌ ఉంటే కాస్త పరిశీలించాలి. అది హెచ్చరిస్తున్నట్లు ఉందా, లేదంటే ఏదైనా సమాచారం అడుగుతోందా? అనేది గమనించాలి.
- హెచ్చరికలకు సంబంధించిన మెస్సేజ్‌ అయితే అది ఖచ్చితంగా బ్యాంకు నుంచే వచ్చింది అయి ఉంటుంది.
- ఏదైనా సమాచారం అడిగితే మాత్రం అనుమానించాలి
- ఇక ఆ మెస్సేజ్‌లో ఏదైనా లింకు ఉంటే మాత్రం దాదాపుగా అది సైబర్‌ నేరగాళ్లు పంపించిన ఎస్‌ఎంఎస్‌ అయి ఉంటుంది. బ్యాంకులు పంపే ఎస్‌ఎంఎస్‌లకు ఎలాంటి లింకు జోడించడం జరగదు.
- అసవరమైతే బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని లేదంటే బ్యాంకు కస్టమర్‌నెంబర్‌కు కాల్ చేయాలని మాత్రమే అసలైన బ్యాంకుల హెచ్చరికల మెస్సేజ్‌లలో సూచిస్తారు.


ఉదాహరణకు కింది ఎస్‌ఎంఎస్‌ చూడండి.

 

ఇది స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్. దీనిని పూర్తిగా చదివితే బ్యాంకు హెచ్చరించడం గమనించవచ్చు. బ్యాంకు పేరుతో వచ్చే నకిలీ ఎస్‌ఎంఎస్‌లను నమ్మొద్దని, ఎలాంటి లింకులు షేర్‌ చేయొద్దని, క్రెడిట్‌, డెబిట్ కార్డులకు చెందిన సీవీవీ, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని ఈ ఎస్‌ఎంఎస్‌లో హెచ్చరించారు.  కాబట్టి ఇది నిజమైన బ్యాంకు పంపించిన ఎస్‌ఎంఎస్‌.

ఫ్యాక్ట్‌ఫుల్‌ అలర్ట్‌ :

 
బ్యాంకుల పేరుతోనే ఇటీవలి కాలంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఆయా బ్యాంకుల కస్టమర్లకు సైబర్‌ క్రిమినల్స్‌ లింకులు పంపించి మన సమాచారాన్ని దోచేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును ఖాళీ చేస్తున్నారు.
 

No comments