Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact Check - ఏదినిజం? గాల్లో పేలిపోయిన ఈ హెలికాప్టర్‌లోనే బిపిన్‌ రావత్‌ ప్రయాణించారా?

  తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కూలిపోయిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఆ...

 




తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కూలిపోయిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఆ హెలికాప్టర్‌లో భారతదేశ త్రివిధ దళాల ఉన్నతాధికారి.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ కూడా ప్రయాణించడమే. మొత్తం 14 మంది ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా 13మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో బిపిన్‌ రావత్‌ సహా ఆయన సతీమణి మధులిక రావత్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

వైరల్ అవుతున్నది ఏంటి?



 


ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిపిన్‌ రావత్ ప్రయాణించిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ ఇదే అని, స్థానికులు దీనిని వీడియో రికార్డ్ చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. జాతీయ, స్థానిక మీడియా మొత్తం ప్రమాదం జరిగిన రోజంతా దీనికి సంబంధించిన కవరేజీనే అందించింది. దీంతో, జనమంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. కొత్త వీడియోలు, ఫోటోలు, ప్రమాదం లైవ్ వీడియోల కోసం సహజంగానే ఆతృతగా ఎదురుచూశారు. ఆ సమయంలోనే ఈ వీడియో కనిపించడంతో చూసిన వాళ్లంతా వైరల్‌ చేశారు.

ఏది నిజం? :


బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన డిసెంబర్‌ 8వ తేదీ సాయంత్రమే ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో చాలామంది అది నిజమే అనుకున్నారు. అయితే, ఈ వీడియోను FACTFUL పరిశీలించింది. ఇది పాత వీడియో అని గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సంపాదించింది. 

 


గతేడాది అంటే 2020 ఫిబ్రవరిలో సిరియాలో ఈ సంఘటన జరిగింది. సిరియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ను సిరియన్‌ రెబెల్స్‌ ఓ మిస్సైల్‌తో కూల్చేశారు. ఆ సమయంలో రికార్డ్ చేసిన వీడియో అది. వీడియోలో ఆడియోను గమనిస్తే కూడా అసలు విషయం తెలిసిపోతుంది. 




అలాగే, జర్నలిస్టు, మిలిటరీ ఏవియేషన్‌ ఎనలిస్ట్ బాబక్‌ తగ్వీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. గతేడాది ఫిబ్రవరి 11వ తేదీన ఆయన ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆయన ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ను కింది లింక్‌లో చూడొచ్చు. 


https://twitter.com/BabakTaghvaee1/status/1227175436309979149?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1227175436309979149%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ffighterjetsworld.com%2Flatest-news%2Faircraft-crash%2Fsyrian-rebels-shot-down-syrian-air-force-mil-mi-17-helicopter-by-a-missile%2F20361%2F



 
FACTFUL - FACTCHECK - ఇది అబద్ధం :

 
సో.. బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్నట్లు వైరల్‌ అవుతున్న ఈ వీడియో అబద్ధం. ఈ వీడియో వాస్తవంగానే జరిగింది అయినా, సిరియాలో యేడాదిన్నర క్రితం జరిగిన సంఘటన. దీనిని ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిన వీడియో అంటూ తప్పుదారి పట్టిస్తున్నారు.

==========================================================
ప్రచారం : తమిళనాడు కూనూరులో హెలికాప్టర్‌ కూలిపోతున్న సమయంలో రికార్డ్‌ చేసిన వీడియో.

వాస్తవం : ఇది గతేడాది ఫిబ్రవరిలో సిరియన్‌ రెబెల్స్‌ కూల్చేసిన ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌ వీడియో ఇది.

కంక్లూజన్‌ : దేశ సైనిక దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్నారనగానే అందరూ ఉత్కంఠగా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూశారు. ఈ సందర్భాన్ని కొందరు తప్పుదారి పట్టించేలా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
==========================================================

No comments