Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact Check - ఏదినిజం? కూలిపోవడానికి ముందు రికార్డయిన హెలికాప్టర్‌ వీడియో - బిపిన్‌ రావత్‌ ఇందులోనే ప్రయాణిస్తున్నారా? వైరల్‌ వీడియోలో నిజమెంత?

  భారత చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలిపోవడం.. అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణా...

 

భారత చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలిపోవడం.. అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, మృతుల్లో బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికా రావత్‌ కూడా ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటనకు సంబంధించిన అప్‌డేట్స్‌ క్షణక్షణం తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపించారు. త్రివిధ దళాలకు చీఫ్ అయిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ కుప్పకూలిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే మీడియాలో ఈ అంశమే ప్రధానమయ్యింది.

ఈ క్రమంలోనే చాలా వీడియోలు జనాన్ని తప్పుదారి పట్టించాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జనం వాటిన వైరల్ చేశారు. అయితే, ప్రమాదం జరిగిన మరుసటిరోజు ఉదయం ఓ వీడియో సోషల్‌ మీడియాలో, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో కనిపించింది.

వైరల్ అవుతున్నది ఏంటి?
 


అతి తక్కువ నిడివి ఉన్న ఆ వీడియోలో హెలికాప్టర్‌ రెండు మూడు సెకన్లలోనే మాయమయ్యింది. అంటే అక్కడ ఆస్థాయిలో మంచు కురుస్తోంది. మరికొన్ని క్షణాల్లోనే పెద్ద శబ్దం వినిపించింది. అదే వీడియోలో కొంతమంది హెలికాప్టర్‌ అతి తక్కువ ఎత్తులోకి రావడాన్ని గమనించి దానిని చూసేందుకు పరుగెత్తుకుంటూ రావడం కనిపిస్తుంది. అందులో హెలికాప్టర్‌కు ఏమైంది? అని అడిగితే వీడియో తీస్తున్న వ్యక్తి.. కూలిపోయినట్లుంది. అని తమిళంలో బదులిస్తున్నాడు.

ఏది నిజం? :


బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన మరుసటిరోజు అంటే డిసెంబర్‌ 9వ తేదీ ఉదయం  ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.  ఈ వీడియోను FACTFUL పరిశీలించింది. ఆ వీడియో తీసిన ప్రదేశం, తమిళంలో అక్కడివాళ్లు మాట్లాడుకుంటున్న వివరాలు గమనించింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలో ఎవరైనా పోస్ట్‌ చేశారా అని పరిశోధించింది. కానీ, అంతకుముందు ఎప్పుడూ ఈ వీడియో పోస్ట్‌ చేయబడలేదు. 



పైగా, సోషల్‌ మీడియాతో పాటు.. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో కూడా  ఈ వీడియో ప్రసారమయ్యింది. మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ప్రసారం చేసేముందు గేట్ కీపింగ్ వ్యవస్థ ఉంటుంది. సోషల్‌ మీడియా మాదిరిగా ఆలోచన లేకుండా ప్రసారం చేసే పరిస్థితి ఉండదు. అయితే, అప్పుడప్పుడూ అక్కడ కూడా పొరపాట్లు దొర్లుతాయి. కానీ, చాలా మీడియాల్లో, మీడియా ఏజెన్సీల్లో కూడా  ఈ వీడియో కనిపించింది. 


 FACTFUL - FACTCHECK - ఇది నిజం :


ఈ వీడియో అబద్ధం అనేదానికి ఆధారాలు ఏవీ కనిపించలేదు. ఈ వీడియో బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌కు సంబంధించినదే అని అధికారికంగా ప్రకటన ఎవరూ చేయకున్నా.. స్థానికుల సమాచారం ఆధారంగా ఇది వాస్తవమే అని తెలుస్తోంది.  

==================================
ప్రచారం : తమిళనాడు కూనూరులో హెలికాప్టర్‌ కూలిపోతున్న సమయంలో రికార్డ్‌ చేసిన వీడియో.

వాస్తవం : వీడియోలో కనిపిస్తున్న దృశ్యం, అధికారులు ప్రకటించిన వాతావరణ పరిస్థితులు సరిపోలుతున్నాయి. అలాగే తమిళంలో మాట్లాడుతున్న సంభాషణలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి. ఇది నిజమే.

కంక్లూజన్‌ :  ఈ వీడియో గతంలో ఎవరూ ఎక్కడా పోస్ట్ చేయలేదు. తమిళనాడు హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన మరుసటిరోజే ఈ వీడియో బయటకు వచ్చింది. అధికారవర్గాలు ఈ వీడియోను ధృవీకరించకున్నా.. దానిని పరిశీలిస్తే నిజమే అని తెలుస్తోంది.
========================================

No comments