Page Nav

HIDE

Grid

GRID_STYLE

Fact Check - ఏదినిజం? కొండల్లో నెమ్మదిగా దిగిన ఈ హెలికాప్టర్‌లోనే బిపిన్‌ రావత్‌ ప్రయాణించారా? వైరల్‌ వీడియోలో నిజమెంత?

  బిపిన్‌ రావత్‌ను పొట్టన బెట్టుకున్న తమిళనాడులోని కూనూరు హెలికాప్టర్‌ ప్రమాదంపై ప్రధాన స్రవంతి మీడియాకు తోడు.. సోషల్‌ మీడియాలో కూడా అప్‌డేట...

 




బిపిన్‌ రావత్‌ను పొట్టన బెట్టుకున్న తమిళనాడులోని కూనూరు హెలికాప్టర్‌ ప్రమాదంపై ప్రధాన స్రవంతి మీడియాకు తోడు.. సోషల్‌ మీడియాలో కూడా అప్‌డేట్స్‌ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలు వీడియోలు వైరల్గా మారాయి. కొన్ని వీడియోలను కనీసం పరిశీలించకుండానే నెటిజన్లు వైరల్‌ చేసేశారు. దీంతో, చాలా మంది ఆ వీడియోలను నిజమే అని నమ్మారు. కానీ, వాటిలో చాలావరకు అబద్ధపు వీడియోలు, తప్పుదారి పట్టించే వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఫ్యాక్ట్‌చెక్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తే గానీ చాలామందికి అసలు విషయం తెలియలేదు.  

అసలేం జరిగింది? :

 
తమిళనాడు వెల్లింగ్టన్‌ మిలటరీ కాలేజీలో గెస్ట్ లెక్చర్‌ ఇచ్చేందుకు భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈనెల 8వ తేదీన బయలుదేరి వెళ్లారు. ఢిల్లీనుంచి విమానంలో సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న బిపిన్‌ రావత్, తన భార్య మధులిక రావత్ సహా మొత్తం 14 మందితో వెల్లింగ్టన్‌ లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే, గమ్యస్థానానికి మరో ఐదు నిమిషాల్లో చేరుకోవాల్సిన బిపిన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నీలగిరి జిల్లాలోని కూనూరు ప్రాంతంలో కూలిపోయింది.

భారత త్రివిధ దళాలకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న బిపిన్‌ రావత్‌.. ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంతో మీడియా మొత్తం ఈ దుర్ఘటనపైనే ఫోకస్‌ పెట్టింది. అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది. ఇదే క్రమంలో సోషల్‌ మీడియాలో కూడా అప్‌డేట్స్ శరవేగంగా నెటిజన్లకు చేరిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి.

వైరల్ అవుతున్నది ఏంటి?
 


 


ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిపిన్‌ రావత్ ప్రయాణించిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ ఇదే అని, స్థానికులు దీనిని వీడియో రికార్డ్ చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఏది నిజం? :


బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన డిసెంబర్‌ 8వ తేదీ సాయంత్రమే ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో చాలామంది అది నిజమే అనుకున్నారు. అయితే, ఈ వీడియోను FACTFUL పరిశీలించింది. ఇది పాత వీడియో అని గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సంపాదించింది. ఈ వీడియో నెటిజన్లను తప్పుదారి పట్టించిందని తేల్చింది. 


 

వాస్తవానికి ఈ హెలికాప్టర్‌ వీడియో అరుణాచల్‌ప్రదేశ్‌లో రికార్డ్‌ చేశారు. గత నవంబర్‌ 18వ తేదీన ఓ హెలికాప్టర్‌ సాంకేతిక కారణాలతో కొండ ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యింది. దానిని అక్కడున్న కొందరు రికార్డ్ చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు క్రూ మెంబర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం తమిళనాడులోని వెల్లింగ్టన్ సమీపంలో చోటు చేసుకుంది. 


అంతేకాదు.. వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. ఈశాన్య భారతానికి చెందిన ఓ వ్యక్తిని స్పష్టంగా గమనించవచ్చు. అతన్ని గమనిస్తే తమిళనాడు వాసి అస్సలు కాదన్నది అర్థమవుతుంది. అంటే.. ఈ వీడియో తమిళనాడులో రికార్డయ్యింది కాదు.  
 


 


FACTFUL - FACTCHECK - ఇది అబద్ధం :

 
సో.. బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్నట్లు వైరల్‌ అవుతున్న ఈ వీడియో అబద్ధం. ఈ వీడియో వాస్తవంగానే జరిగింది అయినా, అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత నవంబర్‌ 18న జరిగిన సంఘటన. దీనిని ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిన వీడియో అంటూ కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు.

==================================

ప్రచారం : తమిళనాడు కూనూరులో హెలికాప్టర్‌ కూలిపోతున్న సమయంలో రికార్డ్‌ చేసిన వీడియో.

వాస్తవం : ఇది ఫిబ్రవరి 18వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్‌లో సాంకేతిక లోపంతో అడవుల్లో దిగిన హెలికాప్టర్‌ వీడియో.  

కంక్లూజన్‌ : దేశ సైనిక దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్నారనగానే అందరూ ఉత్కంఠగా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూశారు. ఈ సందర్భాన్ని కొందరు తప్పుదారి పట్టించేలా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
==================================

1 comment